Maruti Suzuki Eeco: మారుతి సుజుకి ఈకో.. సేల్స్ ఎలా ఉన్నాయంటే..?
Maruti Suzuki Eeco: మారుతి సుజుకి ఈకో ఒక ఫేమస్ వ్యాన్. ఈ వ్యాన్‌ను పెద్ద సంఖ్యలో కస్టమర్లు కొంటున్నారు.
Maruti Suzuki Eeco: మారుతి సుజుకి ఈకో.. సేల్స్ ఎలా ఉన్నాయంటే..?
Maruti Suzuki Eeco: మారుతి సుజుకి ఈకో ఒక ఫేమస్ వ్యాన్. ఈ వ్యాన్‌ను పెద్ద సంఖ్యలో కస్టమర్లు కొంటున్నారు. ఇటీవల వివిధ కార్ల తయారీ కంపెనీలు జనవరి నెల విక్రయాల నివేదికను వెల్లడించాయి. ముఖ్యంగా 'ఈకో' వ్యాన్ సేల్స్ 6శాతం తగ్గాయి.
గత నెల (జనవరి - 2025) మారుతి సుజుకి 11,250 యూనిట్ల ఈకో వ్యాన్‌లను విక్రయించింది. 2024 ఇదే సమయానికి అమ్ముడైన 12,019 యూనిట్లతో పోలిస్తే సంవత్సరానికి 6శాతం సేల్స్ తగ్గాయి. అయితే రాబోయే రోజుల్లో విక్రయాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.
మారుతి సుజుకి ఈకో వ్యాన్‌ను ప్రతి నెలా 10,000 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయిస్తోంది. డిసెంబర్ 2024లో 11,678 యూనిట్లు, నవంబర్‌లో 10,589 యూనిట్లు, అక్టోబర్‌లో 11,653 యూనిట్లు, సెప్టెంబర్‌లో 11,908 యూనిట్లు, ఆగస్టులో 10,985 యూనిట్లు అమ్ముడయ్యాయి.
మారుతి సుజుకి ఈకో వ్యాన్ ధర ఫిబ్రవరి 1 నుండి అన్ని వేరియంట్‌లపై రూ.12,000 పెరిగింది. ఇప్పుడు ఈ వ్యాన్ ధర కనిష్టంగా రూ.5.44 లక్షలు, గరిష్టంగా రూ.6.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). మెటాలిక్ గ్లిస్టెనింగ్ గ్రే, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, మెటాలిక్ బ్రిస్క్ బ్లూతో సహా అనేక కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
ఈ వ్యాన్‌లో 2 పవర్ ట్రెయిన్‌లు ఉన్నాయి. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 81 పిఎస్ హార్స్ పవర్, 104.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 1.2-లీటర్ CNG మోడల్‌లో కూడా అదే ఇంజన్ ఉంటుంది. అయితే ఈ ఇంజన్ 72 పిఎస్ హార్స్ పవర్, 95 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మారుతి సుజుకి ఈకోలో వ్యాన్ వేరియంట్‌లను బట్టి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ వ్యాన్ లీటర్‌పై 19.71 నుండి 26.78 kmpl మైలేజీని అందిస్తుంది. ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చోవడానికి 5, 7 సీట్ల ఆప్షన్లు ఉన్నాయి.
ఈకో వ్యాన్‌లో ఎక్కువ లగేజీని తీసుకువెళ్లడానికి 275 నుండి 540 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. అలానే సెమీ-డిజిటల్ స్పీడోమీటర్, మాన్యువల్ ఏసీ, 12V ఛార్జింగ్ సాకెట్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్, ప్రయాణీకుల భద్రత కోసం రేర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.