Maruti Suzuki: మహీంద్రా BE6ని ఓడించేందుకు త్వరలో మార్కెట్లోకి మారుతి మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

Maruti Suzuki EV vs Mahindra Be6: మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. కంపెనీ త్వరలో ఇండియాలో సొంత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.

Update: 2024-12-12 08:11 GMT

Maruti Suzuki: మహీంద్రా BE6ని ఓడించేందుకు త్వరలో మార్కెట్లోకి మారుతి మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

Maruti Suzuki EV vs Mahindra Be6: మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. కంపెనీ త్వరలో ఇండియాలో సొంత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA 2024 ఈవెంట్‌లో మారుతి సుజుకి కొత్త ఈవీని ఆవిష్కరించింది. ఇది మారుతి ప్రొడక్షన్ రెడీ వెర్షన్. ఈ కారులో ఏ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.. ధర ఎంత అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మహీంద్రా BE6తో పోటీపడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీ గత సంవత్సరం జనవరి 2023లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో EVX పేరుతో దాని కాన్సెప్ట్ వెర్షన్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఆ సమయంలో దీని ప్రొడక్షన్ వెర్షన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.

మారుతి సుజుకి ఇ విటారా ఫీచర్లు

సుజుకి ఇ విటారా ఎస్‌యూవీ హార్ట్‌టెక్-ఇ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. ఇది Be6 కోసం ప్రత్యేకంగా డెవలప్ చేశారు. ఇందులో కంపెనీ 4WD కెపాసిటీ అందిస్తోంది. ప్రస్తుత కస్టమర్స్ అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ఈ కారులో అనేక ఫీచర్లు అందిస్తున్నారు. ఈ ఎస్‌యూవీలో పూర్తిగా ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ఇది మాత్రమే కాదు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, 360 డిగ్రీ కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారుకు 18, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు.

ఈ కారు డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌తో వస్తోంది. అధునాతన టెక్నాలజీతో కూడిన షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్, స్పాయిలర్, కీలెస్ ఎంట్రీ అందుబాటులో ఉంటుంది. బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం పలు రకాల డ్రైవింగ్ మోడ్స్‌ను కూడా కంపెనీ అందించింది. ఈ కారులో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. 2 స్పోక్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు, ఈ ఎలక్ట్రిక్ కారులో ADAS టెక్నాలజీ కూడా ఉంది.

ఇ విటారాలో రెండు బ్యాటరీ ఆఫ్షన్లు ఉంటాయి. ఒకటి 49 కిలో వాట్స్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ. మరొకటి 61 కిలో వాట్స్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇవి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 550 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ దీని ధరను ఇంకా వెల్లడించలేదు. కంపెనీ త్వరలో ఈ కారును ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర కూడా లాంచింగ్ సందర్భంగా వెల్లడికానుంది.

మహీంద్రా BE 6eతో మారుతి సుజుకి ఇ విటారా పోటీ

మహీంద్రా బీఈ 6ఈ రేంజ్ గురించి చెప్పాలంటే.. ఈ కారు గరిష్ట రేంజ్ 682 కిలోమీటర్లు. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ.18.90 లక్షలు.

Tags:    

Similar News