Maruti Suzuki e Vitara: కొత్త ఆట మొదలుపెట్టిన మారుతి.. ఈ విటారాలో సీక్రెట్ ఫీచర్స్.. మార్కెట్ షేక్ కావాల్సిందే..!

Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి తన తొలి కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Update: 2025-04-22 08:20 GMT

Maruti Suzuki e Vitara: కొత్త ఆట మొదలుపెట్టిన మారుతి.. ఈ విటారాలో సీక్రెట్ ఫీచర్స్.. మార్కెట్ షేక్ కావాల్సిందే..!

Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి తన తొలి కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టెస్టింగ్ సమయంలో ఇది చాలాసార్లు కనిపించింది. దీనిని మొదట ఆటో ఎక్స్‌పో 2025లో ప్రవేశపెట్టారు. నివేదికల ప్రకారం, కొన్ని డీలర్‌షిప్‌లలో దీని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ కారును రూ. 25,000 టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు బుకింగ్‌కు సంబంధించి కంపెనీ నుండి ఎటువంటి సమాచారం రాలేదు. ఇది సిటీ డ్రైవింగ్ నుండి హైవే డ్రైవింగ్ వరకు మంచి పర్పామెన్స్‌ను అందిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki e Vitara Price

మీడియా నివేదికల ప్రకారం, కొత్త ఈ విటారా ధర రూ. 16.99 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. కొత్త ఈ-విటారా నెక్సా బ్లూ, గ్రే, సిల్వర్, వైట్, రెడ్, బ్లాక్ సింగిల్-టోన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. వీటితో పాటు స్ప్లెండిడ్ సిల్వర్, ఒపులెంట్ రెడ్, ఆర్కిటిక్ వైట్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్ డ్యూయల్-టోన్ రంగుల్లో అందుబాటులో ఉంది. భారతదేశంలో, ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో పోటీ పడనుంది. మారుతి సుజుకి ఈ కారు ధరను కొంచెం తక్కువగా ఉంచే అవకాశం కూడా ఉంది.

Maruti Suzuki e Vitara Range

కొత్త మారుతి సుజుకి ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది- 49కిలోవాట్, 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, ఇవి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తాయని అంచనాలు చెబుతున్నాయి. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. ఈ విటారాను గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. దీనిని జపాన్, యూరప్‌లకు ఎగుమతి చేయనున్నారు. నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా అమ్మకానికి వస్తుంది.

Maruti Suzuki e Vitara 7 Airbags, ADAS Level-2

భద్రత కోసం, కొత్త ఈ విటారాలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాలు, లెవల్-2 ADAS, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లభిస్తాయి. ఇందులో R18 ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. ముందు, వెనుక లాంప్స్‌ 3-పాయింట్ మ్యాట్రిక్స్ LED DRL ఉన్నాయి. దీనిలో అందించిన డ్రైవర్ సీటును 10 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి 180మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇది కాకుండా, దీని పొడవు 4,275 మిమీ, వెడల్పు 1,800మిమీ, ఎత్తు 1,635మిమీ, వీల్‌బేస్ 2,700మిమి ఉంటుంది.

Tags:    

Similar News