Maruti e Vitara: మారుతి సుజికి మొదటి ఎలక్ట్రిక్ విటారా క్రాష్ టెస్ట్.. ఫ్యామిలీకి ఎంత సేఫ్ అంటే..?
Maruti e Vitara: ఈ సంవత్సరం మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ విటారాను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో పరిచయం చేసింది. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ-విటారా త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది.
Maruti e Vitara: మారుతి సుజికి మొదటి ఎలక్ట్రిక్ విటారా క్రాష్ టెస్ట్.. ఫ్యామిలీకి ఎంత సేఫ్ అంటే..?
Maruti e Vitara: ఈ సంవత్సరం మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ విటారాను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో పరిచయం చేసింది. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ-విటారా త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. కానీ దాని క్రాష్ టెస్ట్ లాంచ్‌కు ముందే జరిగింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మారుతి ఈ-విటారా వివిధ క్రాష్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది. అయితే భారత్ NCAP లేదా గ్లోబల్ NCAP, అధికారిక పరీక్ష కాదు, మారుతి సుజుకి అంతర్గత స్థాయి పరీక్ష. క్రాష్ టెస్ట్‌లో ఈ-విటారా మంచి స్కోర్ చేస్తుందని నిపుణులు ఆశిస్తున్నారు.
కొత్త ఈ-విటారా స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. ఇందులో 49కిలోవాట్, 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. వీటి పరిధి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఈ-విటారా గుజరాత్ ప్లాంట్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు.అక్కడి నుండి జపాన్, యూరప్‌లకు ఎగుమతి అవుతుంది. నెక్సా అవుట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నారు.
భద్రత కోసం కారులో 7 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ , 360-డిగ్రీ కెమెరాలు, లెవల్-2 అడాస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. కొలతల విషయానికి వస్తే ఈ-విటారా పొడవు 4,275 మిమీ, వెడల్పు 1,800 మిమీ, ఎత్తు 1,635 మిమీ, వీల్‌బేస్ 2,700 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 180మిమీ. కారు ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.18 నుంచి 20 లక్షలు. ఇందులో ఇచ్చిన డ్రైవర్ సీటును 10 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఈ-విటారా బుకింగ్ ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. వినియోగదారులు రూ.25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కానీ బుకింగ్ డీలర్‌షిప్ స్థాయిలో మాత్రమే జరుగుతోంది, ఇంకా కంపెనీ నుండి ఎటువంటి అప్‌డేట్ లేదు. ఇండియాలో లాంచ్ అయినప్పుడు దీని ధర ఎంత ఉంటుందో చూడాలి.