Car Price Hike: కార్ లవర్స్‌కు షాక్.. పెరగనున్న కార్ల ధరలు

Car Price Hike: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి కార్ల ధరలను పెంచేందుకు రెడీ అయ్యింది.

Update: 2025-01-25 08:21 GMT

Car Price Hike: కార్ లవర్స్‌కు షాక్.. పెరగనున్న కార్ల ధరలు

Car Price Hike: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి కార్ల ధరలను పెంచేందుకు రెడీ అయ్యింది. ఈ నెలలో కంపెనీ కార్ల ధరలను 4 శాతం వరకు పెంచింది. మరోసారి కూడా మారుతి వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు దీనికి కారణం అని మారుతి సుజుకి కంపెనీ చెబుతోంది. మారుతి కార్ల ధరలు ఏ మేరకు పెరగనున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మీడియా నివేదికల ప్రకారం.. మారుతి సుజుకి కార్ల ధరలు వచ్చే నెల నుండి రూ.5,000 నుండి రూ.32,500 వరకు పెరగనున్నాయి. ఎస్-ప్రెస్సో ధర కనీసం రూ. 5,000 పెరుగుతుంది. వ్యాగన్ఆర్ ధర రూ. 15,000 పెరుగుతుంది. ఇది కాకుండా స్విఫ్ట్ ధరను రూ.5,000 పెంచారు. ఇది మాత్రమే కాదు బ్రెజ్జా, గ్రాండ్ విటారా ధరలు కూడా రూ. 25,000 పెరిగాయి.

మారుతి ఎంట్రీ లెవల్ చిన్న కారు ఆల్టో కె10 ధర రూ.19,500 బాలెనో ధర రూ.9,000 పెరిగింది. అదే సమయంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ధరను రూ.5,000 పెంచారు. కాంపాక్ట్ సెడాన్ డిజైర్ ధర రూ.10,000 పెరిగింది.

మారుతి సుజుకి ఈ విటారా

మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV e Vitara కారును ఆటో ఎక్స్‌పో 2025లో ప్రవేశపెట్టింది. దీనికి రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. దీనిలో లెవల్ 2 అడాస్ కూడా ఉంది. ఈ ఫీచర్‌తో వస్తున్న తొలి మారుతి కారు ఇదే. ఇది త్వరలో భారత్‌లో విడుదల కానుంది. ఇ-విటారా ధర రూ. 17 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో నేరుగా పోటీ పడనుంది.

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. హ్యుందాయ్ మోటార్ ఇండియా టాటా మోటార్స్, ఇతర కార్ల కంపెనీలు కూడా వచ్చే నెలలో తమ కార్ల ధరలను పెంచే అవకాశం ఉంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా వాహనాల ధరలను పెంచే నిర్ణయం తీసుకోవచ్చు.

Tags:    

Similar News