Maruti Suzuki Brezza CSD: బ్రెజ్జా కారు లవర్స్‌కు గుడ్ న్యూస్.. ధరను భారీగా తగ్గించిన కంపెనీ..!

Maruti Suzuki Brezza CSD: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జాను ఈ సంవత్సరం కూడా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (CSD) లో విక్రయానికి అందుబాటులో ఉంచింది.

Update: 2025-02-28 10:20 GMT

Maruti Suzuki Brezza CSD: బ్రెజ్జా కారు లవర్స్‌కు గుడ్ న్యూస్.. ధరను భారీగా తగ్గించిన కంపెనీ..!

Maruti Suzuki Brezza CSD: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జాను ఈ సంవత్సరం కూడా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (CSD) లో విక్రయానికి అందుబాటులో ఉంచింది. సీఎస్‌డీలో ఇప్పటికే చాలా కార్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అంటే దేశానికి సేవ చేసే సైనికులకు మాత్రమే క్యాంటీన్‌లో విక్రయిస్తారు. ఇక్కడ కార్లపై 28శాతం జీఎస్‌టీకి బదులుగా 14శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు ఈ కారు కొనాలని చూస్తుంటే.. ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki Brezza CSD Price

ఇంటర్నెట్‌లోని సమాచారం.. మారుతి బ్రెజ్జా VXI ఇప్పుడు CSDలో అమ్మకానికి అందుబాటులో ఉంది. బ్రెజ్జా VXI ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.75 లక్షలు, సీఎస్‌డీలో కారు ధర రూ. 8.90 లక్షలు. అంటే దీనిపై రూ.85,000 పన్ను ఆదా అవుతోంది.భారతీయ సైనికులు, రక్షణ పౌరులు, మాజీ సైనికులు, రిటైర్డ్ సాయుధ దళాల సిబ్బంది మాత్రమే ఈ పన్ను ప్రయోజనాన్ని పొందుతారు. సాధారణ పౌరులు సాధారణ ధరలో మాత్రమే బ్రెజ్జాను కొనాల్సి ఉంటుంది.

Maruti Suzuki Brezza Features And Specifications

మారుతి బ్రెజ్జాలో చాలా స్పేస్ ఉంది. ఈ కారులో 5 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 3 పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 360 డిగ్రీల కెమెరా ఉంది.

ఈ వాహనంలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్103బిహెచ్‌పి పవర్, 137ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఉంది. మైలేజీ విషయానికి వస్తే.. ఈ వాహనం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 20.15kmpl,ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 19.80kmpl వరకు మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి బ్రెజ్జాకు నిజమైన పోటీ మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOతో ఉంటుంది. ఈ కారు ధర రూ. 7.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఎక్స్‌యూవీ 3XOలో 1.2L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. . ఇందులో 364 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. భద్రత కోసం లెవల్ 2 అడాస్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ, బ్లైండ్ వ్యూ మిర్రర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

Tags:    

Similar News