Mahindra XUV 3XO: మంచి బడ్జెట్ కార్ కొనాలా..? బడ్జెట్ సెగ్మెంట్‌లో దీనికి మించింది లేదు..!
Mahindra XUV 3XO: మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో అనేక ఎస్‌యూవీలు ఉన్నాయి. వీటిలో స్కార్పియో, థార్ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్. అయితే బడ్జెట్ శ్రేణిలో బలమైన ఫీచర్లను అందించే విషయానికి వస్తే కస్టమర్‌లు XUV 3XOని ఎంచుకుంటున్నారు.
Mahindra XUV 3XO: మంచి బడ్జెట్ కార్ కొనాలా..? బడ్జెట్ సెగ్మెంట్‌లో దీనికి మించింది లేదు..!
Mahindra XUV 3XO: మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో అనేక ఎస్‌యూవీలు ఉన్నాయి. వీటిలో స్కార్పియో, థార్ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్. అయితే బడ్జెట్ శ్రేణిలో బలమైన ఫీచర్లను అందించే విషయానికి వస్తే కస్టమర్‌లు XUV 3XOని ఎంచుకుంటున్నారు. ఈ కారు ధర రూ. 8 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్‌యూవీ నేరుగా కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూలతో పోటీపడుతుంది. మీరు కూడా ఈ కారు డిజైన్, ఫీచర్లు, ధరను చూసిన తర్వాత కొనాలనుకుంటే.. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
Mahindra XUV 3XO Engine
ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో 1.2L టర్బో పెట్రోల్, 1.2 లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ , 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లను చూడొచ్చు. ఈ ఇంజన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లతో ఉంటుంది. ఈ కారు ఇంటీరియర్ లేఅవుట్ ఎక్స్‌యూవీ400 ప్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఉంటుంది.
Mahindra XUV 3XO Features
ఎక్స్‌యూవీ 3XO ఫీచర్స్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేట్ చేసిన 7-స్పీకర్ హర్మాన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్, 10.25-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి.