Mahindra XEV 7e: ఫిదా చేస్తున్న ఫీచర్స్.. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ధర ఎంతంటే..?
Mahindra XEV 7e: మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BE 6, XEV 9eలను దేశంలో విడుదల చేసింది. ఈ రెండు ఈవీలు బుకింగ్‌లోనూ కొత్త రికార్డులు సృష్టించాయి.
Mahindra XEV 7e: ఫిదా చేస్తున్న ఫీచర్స్.. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ధర ఎంతంటే..?
Mahindra XEV 7e
మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BE 6, XEV 9eలను దేశంలో విడుదల చేసింది. ఈ రెండు ఈవీలు బుకింగ్‌లోనూ కొత్త రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ SUV ‘XEV 7e’పై వేగంగా పని చేస్తోంది. ఈ ఎస్‌యూవీని రెండు బ్యాటరీ ప్యాక్స్‌తో తీసుకురానున్నారు. తాజాగా ఈ కొత్త మోడల్ ఫోటో లీక్ అయింది. ఈ మోడల్ XUV.e8 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. ఈ కొత్త మోడల్ BE 6 , XEV 9e మధ్య ఉంటుంది. అయితే దీని డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించవు.
కొత్త XEV 7e రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఫుల్ ఛార్జింగ్ పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. బీవైబీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) సెల్ ఈ EVలో ఉపయోగించారు. ఇందులో 59కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుందని భావిస్తున్నారు. కారులో 6 సీట్లు ఉంటాయి.
అంతేకాకుండా కారులో ఫ్రంట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ట్రిపుల్ ఇంటిగ్రేటెడ్ స్క్రీన్, 16-స్పీకర్ ఆడియో సిస్టమ్, 2-స్పీకర్ స్టీరింగ్ వీల్, కెప్టెన్ సీట్లు, లెవల్-2 అడాస్ వంటి ఫీచర్లను చూడచ్చు. కొత్త XEV 7e ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు. ఈ కొత్త మోడల్‌ను త్వరలో దేశంలో విడుదల చేయచ్చు.
రాబోయే మహీంద్రా XEV 7eలో కొత్త క్లోజ్డ్ గ్రిల్ ఉంటుంది. సిగ్నేచర్ LED DRL లైట్లను ఇందులో చూడచ్చు. ఈ కారు కొద్దిగా భిన్నంగా కనిపించడానికి ప్రత్యేకమైన స్టార్-ప్యాటర్న్ ఏరో వీల్స్, కొత్తగా డిజైన్ చేసిన లోయర్ ఫ్రంట్ బంపర్
అందించారు. కారు సైడ్ ప్రొఫైల్, వీల్స్, బూట్ డిజైన్, టైలాంప్, పిల్లర్ స్ట్రక్చర్ కంపెనీ XUV700ని పోలి ఉంటాయి. కొత్త మోడల్ INGLO ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుంది.
ఈ ప్లాట్‌ఫామ్ చాలా సురక్షితమైది, దీనిని కంపెనీ రాబోయే కార్లలో ఉపయోగిస్తుంది. మహీంద్రా EVల రూపకల్పన దేశంలో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ కార్ల నుండి చాలా భిన్నంగా ఉంటుంది. కంపెనీ భద్రతపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతోంది.