Mahindra XUV 700 Discount: మహీంద్రా ఎక్స్‌యూవీపై బంపర్ ఆఫర్.. ఏకంగా లక్ష డిస్కౌంట్

Update: 2025-02-07 15:10 GMT

Mahindra XUV 700 Discount: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కార్లపై గొప్ప డిస్కౌంట్స్ అందిస్తోంది. మీరు ఫిబ్రవరి 2025లో కొత్త మహీంద్రా XUV700ని కొనాలని అనుకున్నట్లయితే.. ఈ ఎస్‌యూవీ కొనుగోలుపై రూ. 1 లక్ష వరకు మీకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎస్‌యూవీ కారుపై ఉన్న ఆఫర్లు, ధర, ఫీచర్లు తదితర వివరాలును ఇప్పుడు తెలుసుకుందాం.

మహీంద్రా 2024లో విడుదల చేసిన XUV 700 కారుపై గరిష్టంగా రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అలానే AX7 ట్రిమ్‌పై రూ. 1 లక్ష, బేస్ MX ట్రిమ్‌లపై రూ. 60 వేలు డిస్కౌంట్ లభిస్తోంది. ఇవేకాకుండా AX3, AX5 ట్రిమ్‌లపై కూడా రూ. 50 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

అంతేకాకుండా MY25 XUV 700 AX5, AX5S వేరియంట్‌లపై రూ. 20 వేలు వరకు తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారు 5, 6, 7 సీట్ల వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 

మహీంద్రా కంపెనీ ఈ XUV700 కారును 2 ఇంజన్ ఆప్షన్స్‌లో విడుదల చేసింది. ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 200 పిఎస్ పవర్, 380 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ 185 పిఎస్ పవర్, 450 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. 

6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారు లీటరుకు 17 కిమీల మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

Tags:    

Similar News