Kia Syros: బుకింగ్స్ సునామీ..సైరస్ ఎస్‌యూవీ కోసం జనం పడిగాపులు..!
Kia Syros: కియా మోటార్స్ దక్షిణ కొరియాలో ఒక ఫేమస్ కార్ల తయారీ కంపెనీ. డిసెంబర్ 19న, కంపెనీ కొత్త 'సైరస్' ఎస్‌యూవీని ఘనంగా ఆవిష్కరించింది.
Kia Syros: బుకింగ్స్ సునామీ..సైరస్ ఎస్‌యూవీ కోసం జనం పడిగాపులు..!
Kia Syros: కియా మోటార్స్ దక్షిణ కొరియాలో ఒక ఫేమస్ కార్ల తయారీ కంపెనీ. డిసెంబర్ 19న, కంపెనీ కొత్త 'సైరస్' ఎస్‌యూవీని ఘనంగా ఆవిష్కరించింది. ఈ కారు బుకింగ్‌లు కొన్ని రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. కస్టమర్ల నుండి అంచనాలకు మించి స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయి. ఈ కారు బుకింగ్‌లు కూడా 10,000 యూనిట్ల మార్కును దాటాయి. ఇప్పుడు కూడా కస్టమర్లు కొత్త సైరస్ ఎస్‌యూవీని పిచ్చిపిచ్చిగా బుక్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం కంపెనీ కొత్త కియా సైరస్ ఎస్‌యూవీని దేశవ్యాప్తంగా వివిధ డీలర్‌షిప్‌లకు డెలివరీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించిన అనేక పోస్టులు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ కొత్త కారు ఫిబ్రవరి 1న లాంచ్ అవుతుంది. ఆ తర్వాత పంపిణీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
ఈ కియా సైరస్ SUV చాలా తక్కువ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 9 లక్షలుగా అంచనా. ఇది HTK, HTK (O), HTK Plus, HTX, HTX Plus, HTX Plus (O) వేరియంట్‌లలో వస్తుంది. కారు ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది మెరుగైన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు,ఎల్‌ఈడీ డీఆర్‌లు, L-షేప్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, ఫ్లాట్ టెయిల్‌గేట్, అల్లాయ్ వీల్స్, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.
కొత్త కియా సైరస్ ఎస్‌యూవీ 2-సిలిండర్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. దీనికి 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఇది 17.65 నుండి 20.75కెఎమ్‌పిెల్ మైలేజీని ఇస్తుందని చెబుతున్నారు.
ఈ కారులో 5 మంది హాయిగా ప్రయాణించవచ్చు. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్‌ప్లే కోసం 12.3-అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్, డ్యూయల్ జోన్ ఏసీ, 4-వే పవర్డ్ డ్రైవర్ సీటు, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, అప్/డౌన్ పవర్ విండోస్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.
సేఫ్టీ పరంగా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ప్రయాణీకుల రక్షణ కోసం 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. కొత్త సైరస్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వంటి వాటితో పోటీపడుతుంది.