Kia Syros Suv Variants: గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన కియా సైరోస్.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది..!
Kia Syros Suv Variants: కియా సైరోస్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్‌లో గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ కారు ధర రూ.8.99 లక్షల నుండి మొదలై రూ.17.80 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది.
Kia Syros Suv Variants: గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన కియా సైరోస్.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది..!
Kia Syros Suv Variants: కియా సైరోస్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్‌లో గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ కారు ధర రూ.8.99 లక్షల నుండి మొదలై రూ.17.80 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఈ ఎస్‌యూవీ HTC, HTC (O), HTC Plus, HTX, HTX Plus, HTX Plus (O) వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అయితే మీరు ఈ కారు కొనాలని చూస్తుంటే రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కియా సైరోస్ HTC అనేది ఎంట్రీ-లెవల్ వేరియంట్. ఈ మోడల్ ఆటోలో హాలోజన్ హెడ్‌లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్, సన్ గ్లాసెస్ హోల్డర్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి ఫీచర్లు ఉన్నాయి.
సైరోస్ HTC (O) వేరియంట్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో అల్లాయ్ వీల్స్ (16-అంగుళాల) రూఫ్ రెయిల్స్, ప్యాసింజర్ - సైడ్ సీట్ బ్యాక్ పాకెట్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆటో ఫోల్డింగ్ ORVMలు ఉన్నాయి.
కియా సైరోస్ HTC ప్లస్ మోడల్‌లో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్లూ అండ్ గ్రే సెమీ-లెదర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ సైడ్ విండో వన్-టచ్ అప్/డౌన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, పాడిల్ షిఫ్టర్లు, మొత్తం 4 డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆప్షన్ ఉన్నాయి.
సైరోస్ HTX ఫీచర్లలో ఎల్ఈడీ హెడ్‌లైట్లు, డ్రాప్-డౌన్ ఎల్ఈడీ డీఆర్ఎలు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, బూట్ ల్యాంప్స్, బ్లూ అండ్ గ్రే సెమీ-లెదర్ సీట్లు, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రేర్ వైపర్-వాషర్‌లు ఉన్నాయి.
ఈ కారు HTX ప్లస్ వేరియంట్ విషయానికి వస్తే.. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, పుడిల్ లైట్లు, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ప్యాడిల్ షిఫ్టర్స్, యాంబియంట్ లైటింగ్, 8-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-కెమెరా డాష్‌క్యామ్, రేర్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
కియా సైరోస్ ఎస్‌యూవీ టాప్-ఎండ్ వేరియంట్ అయిన HTX ప్లస్ (O)లో దాదాపు 'HTX ప్లస్'లో ఉన్న అదే ఫీచర్లు ఉన్నాయి. అదనంగా సైడ్ పార్కింగ్ సెన్సార్లు, లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 360-డిగ్రీ కెమెరా ఉంటాయి.
ఈ కియా సైరోస్‌లో 5-సీట్ల ఆప్షన్ ఉంది. కాబట్టి, 5 మంది ప్రయాణికులు సులభంగా ప్రయాణించచ్చు. కారులో 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఉన్నాయి. గేర్‌బాక్స్ ఆప్షన్స్‌లో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్లను చూడొచ్చు.