Kia Syros Bookings: కియా నుంచి కొత్త కారు.. బుకింగ్స్ షూరూ

Update: 2024-12-19 15:45 GMT

Kia Syros Bookings: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ కియా సరికొత్త సైరోస్ ఎస్‌యూవీ కియా సిరోస్‌ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారతీయ మార్కెట్లో కంపెనీకి ఇది 7వ మోడల్. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే సోనెట్, సెల్టోస్, నిస్సాన్, కార్నివాల్, EV6, EV9 ఉన్నాయి.

సిరోస్‌లో కంపెనీ చాలా మంచి ఫీచర్లను అందించింది. కంపెనీ ఇప్పటికే ఉన్న మోడల్స్‌తో పోలిస్తే కొత్త కారు డిజైన్‌ను పూర్తి భిన్నంగా తీసుకొచ్చింది. ఈ కారు ధరలను ఇంకా ప్రకటించలేదు. కియా సైరోస్ బుకింగ్ జనవరి 3, 2025 నుండి ప్రారంభమవుతుంది. డెలివరీ ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమవుతాయి.

కియా ఈ SUVకి గ్రీక్ ఐస్‌లాండ్ పేరు పెట్టింది. ఈ కొత్త ఎస్‌యూవీని మరింత విశాలంగా తయారు చేశారు. ఇది రిక్లైనింగ్ రియర్ సీట్లు కలిగి ఉంది. ఈ కారు ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇందులో LED లైట్లు, LED DRLలు, పనోరమిక్ సన్‌రూఫ్, LED టెయిల్ లైట్లు, యాంబియంట్ లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టెర్రైన్, డ్రైవింగ్ మోడ్స్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, లెవెల్స్ ఉన్నాయి. 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, Isofix చైల్డ్ ఎంకరేజ్ వంటి ఫీచర్లను అందించారు.

కియా సిరోస్ ఎస్‌యూవీలో 1 లీటర్ కెపాసిటి గల టర్బో పెట్రోల్ స్మార్ట్‌స్ట్రీమ్ ఇంజన్ అమర్చారు. ఇది 6-స్పీడ్ మాన్యువల్,  7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. డీజిల్ వేరియంట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో అందించారు. సిరోస్‌లోని డీజిల్ గరిష్టంగా 116 bhp పవర్,  250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం వీటిలో ఏ ఇతర SUV లేవు.  Syros సబ్-కాంపాక్ట్ SUV హై ట్రిమ్ కోసం చూస్తున్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. లేదా కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ ఎలివేట్, మారుతి సుజికి గ్రాండ్ విటారా, స్కోడా కైలాక్, వోక్స్‌వేగన్ టైగూన్ ఇతర కాంపాక్ట్ SUVల ఎంట్రీ లెవల్ వేరియంట్స్‌కు గట్టి పోటీనిస్తుంది.

Tags:    

Similar News