Kia Carens Facelift: కియా నుంచి కొత్త ఫ్యామిలీ కార్.. డిజైన్, ఇంటీరియర్ లీక్..!
Kia Carens Facelift: కియా ఇండియా త్వరలో కంపెనీ ఫేమస్ ఎంపీవీ కేరెన్స్‌ని కొత్త అవతార్‌లో పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే టెస్టింగ్ సమయంలో ఈ కారు కనిపించింది.
Kia Carens Facelift: కియా నుంచి కొత్త ఫ్యామిలీ కార్.. డిజైన్, ఇంటీరియర్ లీక్..!
Kia Carens Facelift: కియా ఇండియా త్వరలో కంపెనీ ఫేమస్ ఎంపీవీ కేరెన్స్‌ని కొత్త అవతార్‌లో పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే టెస్టింగ్ సమయంలో ఈ కారు కనిపించింది. ఫిబ్రవరి 2022లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ 7-సీటర్ కారును సుమారు 2 సంవత్సరాల తర్వాత ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో అప్‌డేట్ చేస్తుంది. కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన డిజైన్, ఇంటీరియర్, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
కియా కేరెన్స్ డిజైన్
కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ స్పై షాట్స్‌లో కొత్త ఫ్రంట్ ఫాసియా, కొత్త లైటింగ్ క్లస్టర్‌ని అప్‌గ్రేడ్‌గా చూడొచ్చు. స్టార్‌మ్యాప్ ఎల్ఈడీ ఎలిమెంట్స్, కొత్త హెడ్‌లైట్‌లను కియా ఈవీ5 నుంచి తీసుకున్నారు.
కియా కేరెన్స్ ఇంటీరియర్
క్యాబిన్ అప్‌డేట్‌ల గురించి మాట్లాడితే కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్‌తో పాటు అప్‌డేట్ చేసిన టూల్స్ చూస్తారు. భద్రత కోసం ఈ ఎంపీవీలో వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉండచ్చు
కియా కేరెన్స్ ఇంజన్
కంపెనీ కారులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ అందిస్తుంది. ఒక లీటర్ పెట్రోల్‌లో గరిష్టంగా 17 కిమీ, ఒక లీటర్ డీజిల్‌లో గరిష్టంగా 21.3 కిమీ మైలేజ్ ఇస్తుంది.
ఫేస్‌లిఫ్టెడ్ కేరెన్స్‌తో పాటు, కంపెనీ కేరెన్స్ ఈవీని కూడా పరిచయం చేయనుంది. ఈవీ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. కేరెన్స్ ఫుల్ ఛార్జింగ్‌పై 400-500 కిమీ రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు.