Kia Carens Clavis Launch: అద్భుతం.. మహా అద్భుతం.. కియా కేరెన్స్ క్లావిస్ లాంచ్.. ఈ సరికొత్త ఫీచర్స్ అదుర్స్..!
Kia Carens Clavis Launch: కియా భారతదేశంలో తన ఫేస్‌లిఫ్ట్ ఫ్యామిలీ ఎంపీవీ కొత్త కేరెన్స్ క్లావిస్‌ను ప్రవేశపెట్టింది.
Kia Carens Clavis Launch: అద్భుతం.. మహా అద్భుతం.. కియా కేరెన్స్ క్లావిస్ లాంచ్.. ఈ సరికొత్త ఫీచర్స్ అదుర్స్..!
Kia Carens Clavis Launch: కియా భారతదేశంలో తన ఫేస్‌లిఫ్ట్ ఫ్యామిలీ ఎంపీవీ కొత్త కేరెన్స్ క్లావిస్‌ను ప్రవేశపెట్టింది. దీని డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. కానీ దాని ఫీచర్లు చాలా కొత్తగా ఉన్నాయి. ప్రస్తుతం దీని ధర వెల్లడించలేదు, కానీ వచ్చే నెలలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. మీరు కూడా ఈ ఎంపీవీని కొనాలని ఆలోచిస్తుంటే దాని ఫీచర్లు, ఇంజిన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Kia Carens Clavis Design
కియా కొత్త ఎంపీవీ కేరెన్స్ క్లావిస్ కొత్త 2.0 డిజైన్‌తో రానుంది. కంపెనీ అదే డిజైన్‌పై ఈవీ9, సైరోస్ వంటి కార్లను కూడా అందిస్తోంది. కానీ ఈ మోడల్ డిజైన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. కియా కార్లలో కూడా ఈ రకమైన డిజైన్‌ను మనం ఇంతకు ముందు చూశాము.
Kia Carens Clavis Features
కొత్త కారెన్స్ క్లావిస్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ఐస్ క్యూబ్ హెడ్‌లైట్లు, కనెక్ట్ చేసిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్‌తో వస్తుంది. అదే సమయంలో, 26.62 అంగుళాల డ్యూయల్ స్క్రీన్, ముందు వెంటిలేటెడ్ సీట్లు, 64 కలర్ యాంబియంట్ లైట్లు, 360 డిగ్రీల కెమెరా, ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రెండు స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, రెండవ వరుస కెప్టెన్ సీట్లు వంటి ఫీచర్లు ఇందులో అందించారు. భద్రత కోసం, కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్+ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్, డిస్క్ బ్రేక్ అలాగే 20 భద్రతా ఫీచర్స్‌తో లెవల్-2 అడాస్ ఉన్నాయి.
Kia Carens Clavis Engine
ఇంజిన్ గురించి చెప్పాలంటే, కొత్త కేరెన్స్ క్లావిస్‌లో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ , 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌లు ఉన్నాయి. మీ అవసరానికి అనుగుణంగా ఇంజిన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ బుకింగ్స్ ఈ రాత్రి 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఇది మహీంద్రా స్కార్పియో N, ఎక్స్‌యూవీ 700, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్, టయోటా ఇన్నోవా క్రిస్టాలతో నేరుగా పోటీపడుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 15 లక్షలు ఉండవచ్చు.