ఎంజీ కార్లకు పెరిగిన డిమాండ్.. ఏవి ఎక్కువ సేల్ అవుతున్నాయంటే..

Update: 2025-02-03 15:00 GMT

ఎంజీ కార్లకు పెరిగిన డిమాండ్.. ఏవి ఎక్కువ సేల్ అవుతున్నాయంటే..

JSW MG Motor India: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా జనవరి 2025లో 4,455 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ లెక్కలను గతేడాదితో పోలిస్తే 256శాతం వృద్ధిని సూచిస్తున్నాయి. కంపెనీ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. ఎంజీ విండ్సర్, కామెట్, జెఎస్ ఈవీ మోడల్స్ మొత్తం విక్రయాల్లో 70శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ కార్ల ఫీచర్లను తెలుసుకుందాం.

MG Windsor EV

విండ్సర్ గత కొన్ని నెలల్లో అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలను చూసింది. విండ్సర్ EV ధర గత నెలలో రూ. 50,000 పెరిగినప్పటికీ, వినియోగదారులలో ప్రముఖ ఎలక్ట్రిక్ కారుగా మిగిలిపోయింది.

విండర్స్ ఈవీ ధర గురించి మాట్లాడితే.. MG మోటార్ విండ్సర్ ఈవీ ధర బ్యాటరీ రెంటల్ ఆప్షన్‌తో  రూ. 9.99 లక్షల నుండి రూ. 11.99 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంది. ఈ ధరలో బ్యాటరీ ప్యాక్ ధర ఉండదు, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ కోసం మీరు కిలోమీటరుకు రూ. 3.5 చెల్లించాలి.

ఎంజీ విండ్సర్ ఈవీలో 38కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది.  ఈవీలో ఉండే సింగిల్ ఎలక్ట్రిక్ మోటారు 136 పిఎస్ పవర్, 200 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌ను రిలీజ్ చేస్తుంది. బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.అలానే, విండర్స్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.  55 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయచ్చు. సేఫ్టీ పరంగా.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్,  టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి. 

MG Comet EV

ఎంజీ కామెట్ EV ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు. ఈ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.7 లక్షల నుండి రూ.9.65 లక్షల వరకు ఉంది. కారుపై బ్యాటరీ రెంటల్ స్కీమ్  కూడా అందుబాటులో ఉంది. కామెట్ EV ధర రూ. 5 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

ఎంజీ కామెట్ ఈవీలో  17.3కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ 42 పిఎస్, 110 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేసే రియర్-యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుకు పవర్ సప్లై చేస్తుంది. ARAI ప్రకారం.. కారు మైలేజ్ 230 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

MG ZS EV

ఎంజీ జెఎస్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.98 లక్షల నుండి మొదలై, రూ. 25.75 లక్షలు వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో మోటారు  50.3కిలోవాట్ బ్యాటరీ ప్యా ఉపయోగిస్తుంది. ఈ మోటారు 177 పిస్ పవర్, 280 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు రేంజ్ 461 కిలోమీటర్లు.

Tags:    

Similar News