Hyundai Verna SX Plus Variant Launched: స్టన్నింగ్ ఫీచర్స్‌తో ఆ హ్యూందాయ్ కారు నయా వెర్షన్.. లుక్ ఎలా ఉందంటే..?
Hyundai Verna SX Plus Variant Launched: దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన ప్రసిద్ధ సెడాన్ కారు హ్యుందాయ్ వెర్నాలో కొత్త SX+ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Hyundai Verna SX Plus Variant Launched: దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన ప్రసిద్ధ సెడాన్ కారు హ్యుందాయ్ వెర్నాలో కొత్త SX+ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో కూడిన ఈ కొత్త వేరియంట్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్‌తో ప్రవేశపెట్టింది. వీటి ధర వరుసగా రూ. 13.79 లక్షలు, రూ. 15.04 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ సెడాన్‌లో అనేక ప్రీమియం ఫీచర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది.
ఇప్పటివరకు టాప్ SX(O) వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న అనేక అధునాతన ఫీచర్లు ఈ కొత్త వేరియంట్‌లో అందించారు. అంటే ఈ వేరియంట్ తక్కువ ధరకే మరిన్ని ఫీచర్లను అందిస్తుంది. హ్యుందాయ్ ఇండియా మిడ్‌సైజ్ సెడాన్ ఎంపిక చేసిన వేరియంట్‌ల కోసం వైర్డు-టు-వైర్‌లెస్ అడాప్టర్‌ను కూడా అందిస్తోంది, ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ ఇస్తుంది. వెర్నాతో పాటు, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, ఎక్స్‌టెర్రా, ఆరా, వెన్యూ (N లైన్ కూడా), అల్కాజార్ మోడళ్లతో కూడా అడాప్టర్‌ను అందిస్తోంది.
కొత్త వైర్డు-టు-వైర్‌లెస్ అడాప్టర్ ధర రూ.4,500. ఇది 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో వచ్చే వెర్నా SX(O), SX టర్బో, SX(O) టర్బో వేరియంట్‌లకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. బేస్ వెర్నా E ట్రిమ్‌లో టచ్‌స్క్రీన్ లేదు. దీనితో పాటు, S, SX, SX+, S(O) టర్బో వేరియంట్లలో 8-అంగుళాల చిన్న డిస్‌ప్లే అందించారు. ఇది ఇప్పటికే యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ ఇస్తుంది.
హ్యుందాయ్ వెర్నా SX+ ఒకే ఒక ఇంజన్ ఎంపికలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది 1.5 లీటర్, 4 సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది. ఈ ఇంజిన్ 115హెచ్‌పి పవర్, 143.8ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటరుకు 18-19 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది.
కంపెనీ వెర్నా SX+ లో కొన్ని ప్రత్యేకమై ఫీచర్లను చేర్చింది. ఇందులో ఎల్ఈబీ హెడ్‌లైట్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక స్పాయిలర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఇది 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, హీటెడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, టాప్-స్పెక్ SX(O) వేరియంట్ నుండి తీసుకువెళ్లబడిన లెథరెట్ సీట్ అప్హోల్స్టరీని కూడా పొందుతుంది. భద్రత కోసం, దీనికి 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ , వెనుక పార్కింగ్ కెమెరా అందించారు.