Hyundai Cars Discount Offer: హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్.. వెన్యూ-వెర్నా నుండి ఎక్స్‌టర్ వరకు ఎంత తగ్గాయంటే ?
Hyundai Cars Discount Offer: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ ఇండియాలో చాలా కాలంగా తన కార్లను విక్రయిస్తుంది.
Hyundai Cars Discount Offer: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ ఇండియాలో చాలా కాలంగా తన కార్లను విక్రయిస్తుంది. ప్రతేడాది అదిరిపోయే డిజైన్‌తో అత్యాధునిక ఫీచర్స్‌తో కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా బడ్జెట్ కార్లను విడుదల చేస్తుంది. దేశంలో హ్యుందాయ్ కార్లు చాలా పాపులర్ అయ్యాయి. హ్యుందాయ్ ఇండియా తన కార్లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్టీరియర్, వెర్నా, టక్సన్, ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 లపై భారీ ఆఫర్లను అందిస్తుంది. హ్యుందాయ్ కార్లపై గరిష్టంగా రూ.68 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. ఈ ఆఫర్ హ్యుందాయ్ 2024 మోడళ్లపై ఇస్తోంది.
గ్రాండ్ i10 నియోస్‌పై అత్యధిక డిస్కౌంట్
హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై అత్యధిక డిస్కౌంట్ ఇస్తుంది ఈ కారుపై రూ.68 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆఫర్ మార్చి 2025 వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ హ్యుందాయ్ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చింది. ఇది 83 hp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫ్షన్ తో వస్తుంది. సీఎన్జీ మోడల్ తో ఈ కారు మెరుగైన మైలేజీని ఇస్తుందని పేర్కొంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.98 లక్షల నుండి రూ.8.62 లక్షల వరకు ఉంటుంది.
వెన్యూ , వెర్నాపై కూడా ఆఫర్లు
హ్యుందాయ్ వెన్యూపై రూ.45 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఒక డీజిల్, రెండు పెట్రోల్ ఇంజన్ల ఆఫ్షన్లతో వస్తుంది. హ్యుందాయ్ వెన్యూ స్పోర్టియర్ N లైన్ మోడల్‌పై రూ. 35,000 వరకు తగ్గింపు కూడా ఇస్తుంది కంపెనీ. హ్యుందాయ్ వెర్నాపై రూ.50 వేల వరకు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. డీజిల్ ఇంజిన్ ఆఫ్షన్ ఇందులో చేర్చలేదు.
ఇతర హ్యుందాయ్ కార్లపై ఆఫర్లు
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై రూ.45 వేల వరకు ప్రయోజనాలు అందించనుంది కంపెనీ. ఈ కారు గ్రాండ్ i10 నియోస్ లాగానే ఉంటుంది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో ఉంటుంది. మార్చి 2025 లో హ్యుందాయ్ ఆరాపై రూ. 53 వేల వరకు ప్రయోజనాలు కూడా అందించనుంది. హ్యుందాయ్ ఐ20, టక్సన్‌లపై రూ.50 వేల వరకు తగ్గింపును అందిస్తున్నారు.