Hyundai Motor India: కస్టమర్లకు షాక్ ఇచ్చిన హ్యుందాయ్ కంపెనీ.. త్వరలో ఆ కార్లపై రూ.25వేల పెంపు..!
Hyundai Motor India: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కస్టమర్లకు 1 జనవరి 2025న పెద్ద షాక్ ఇవ్వబోతోంది.
Hyundai Motor India: కస్టమర్లకు షాక్ ఇచ్చిన హ్యుందాయ్ కంపెనీ.. త్వరలో ఆ కార్లపై రూ.25వేల పెంపు
Hyundai Motor India: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కస్టమర్లకు 1 జనవరి 2025న పెద్ద షాక్ ఇవ్వబోతోంది. కంపెనీ తాజాగా ధరల పెంపును ప్రకటించింది. హ్యుందాయ్ తన అన్ని మోడళ్ల ధరలను పెంచబోతోంది. సమాచారం ప్రకారం, కంపెనీ ధరను రూ.20,000 కంటే ఎక్కువ పెంచవచ్చు. హ్యుందాయ్ కంటే ముందు ఆడితో సహా అనేక ఇతర కంపెనీలు కూడా ధరల పెంపును ప్రకటించాయి. దాని వివరాలను వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి కొత్త సంవత్సరం కార్ల తయారీ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతుంటాయి. ఇటీవలి నివేదికల ప్రకారం, జనవరి 1, 2025 నుండి హ్యుందాయ్ తన కార్ల ధరలను కూడా పెంచబోతోంది. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం, మారకపు రేటు అననుకూలత, లాజిస్టిక్స్‌లో ఎక్కువ ఖర్చులు పెరగడం ఈ ధరల పెంపునకు కారణమని కంపెనీ పేర్కొంది.
ధరలు ఎంత పెరుగుతాయి?
దీనిపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ ఆపరేషన్స్ హెడ్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. జనవరి 1, 2025 నుండి అన్ని 2025 కొత్త సంవత్సరపు మోడళ్ల ధరలను రూ.25,000 వరకు పెంచనున్నట్లు తెలిపారు.
ధర పెరగడానికి గల కారణం ఏంటంటే ?
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ దీనిపై వ్యాఖ్యానిస్తూ.. కస్టమర్లపై తక్కువ ప్రభావం చూపడమే మా ప్రయత్నం అని అన్నారు. దీనితో పాటు, పెరుగుతున్న ఖర్చులను కంపెనీ వీలైనంత వరకు భరిస్తోంది. అయినప్పటికీ, ఇన్‌పుట్ ఖర్చులు నిరంతరం పెరగడంతో, ఈ ధర పెరుగుదలలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం ఇప్పుడు తప్పనిసరి అయింది.