Hyundai Creta: అమ్మకాలలో క్రెటా కొత్త రికార్డ్.. గత నెలలో 18,522 కార్లు అమ్ముడయ్యాయి

Hyundai Creta Sales in January 2025 హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త క్రెటా ఎలక్ట్రిక్‌ని ఆటో ఎక్స్‌పో 2025లో విడుదల చేసింది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి.

Update: 2025-02-01 15:58 GMT

Hyundai Creta: అమ్మకాలలో క్రెటా కొత్త రికార్డ్.. గత నెలలో 18,522 కార్లు అమ్ముడయ్యాయి

Hyundai Creta: హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫేమస్ ఎస్‌యూవీ క్రెటా అమ్మకాలలో కొత్త రికార్డును సృష్టించింది. గత నెలలో హ్యూందాయ్ కంపెనీ 18,522 క్రెటా కార్లను విక్రయించింది. ఈ సేల్‌లో ICE క్రెటా, క్రెటా ఎలక్ట్రిక్ మోడల్ ఉన్నాయి. క్రెటా పెట్రోల్ వేరియంట్ ధర రూ. 11.00 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభం కాగా, ఎలక్ట్రిక్ క్రెటా ధర రూ. 17.99 లక్షల నుండి మొదలవుతుంది. ఈ కారు ధర, డ్రైవింగ్ రేంజ్ భారీ జనాధరణ లభించే విధంగా చేశాయి. రండి.. ఈ కారు విశేషాలు తెలుసుకుందాం.

హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త క్రెటా ఎలక్ట్రిక్‌ని ఆటో ఎక్స్‌పో 2025లో విడుదల చేసింది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఈ కారు టాటా కర్వ్ ఎలక్ట్రిక్, మహీంద్రా BE6లతో నేరుగా పోటీపడుతుంది. భద్రత కోసం.. 6 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ బ్రేక్ ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్, లెవల్ 2 అడాస్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్లను ఇందులో చూడవచ్చు.

ఈ కారు డిజైన్, ఇంటీరియర్ క్లీన్‌గా ఉంది. క్రెటాకు పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్ అనే పేరుంది. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, కీ-లెస్ ఎంట్రీ, బ్యాక్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు కారులో కనిపిస్తాయి.

కొత్త క్రెటా ఎలక్ట్రిక్‌ని రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో లాంచ్ చేసింది. అందులో మొదటి 51.4కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఫుల్ ఛార్జింగ్‌పై 472కిమీల రేంజ్ అందిస్తుంది. 42 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జింగ్‌పై 390 కిమీల రేంజ్ అందిస్తుంది.

ఈ కారును DC ఛార్జింగ్ సహాయంతో 10 శాతం నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 58 నిమిషాలు పడుతుంది. అయితే AC హోమ్ ఛార్జింగ్‌తో 10 శాతం నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. ఈ కారు కేవలం 7.9 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

Tags:    

Similar News