Hyundai Creta New Variant: కొత్త వేరియంట్స్‌లో హ్యుందాయ్ క్రెటా.. ఏం మారిందో తెలుసా..?

Hyundai Creta: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటాను భారత్‌లో రెండు కొత్త వేరియంట్‌లతో పరిచయం చేసింది.

Update: 2025-03-04 07:14 GMT

Hyundai Creta New Variant: కొత్త వేరియంట్స్‌లో హ్యుందాయ్ క్రెటా.. ఏం మారిందో తెలుసా..?

Hyundai Creta: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటాను భారత్‌లో రెండు కొత్త వేరియంట్‌లతో పరిచయం చేసింది. హ్యుందాయ్ క్రెటా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ. ఇటీవలే క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. దీనికి కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. క్రెటా రెండు కొత్త వేరియంట్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హ్యుందాయ్ క్రెటాలో రెండు కొత్త వేరియంట్‌లను కంపెనీ తీసుకొచ్చింది. ఈ వేరియంట్‌లను కంపెనీ మార్చి 2025లో పరిచయం చేసింది. ఈ వేరియంట్‌లలో ఒకటి EX (O) పేరుతో పరిచయం చేయగా, మరొక వేరియంట్ SX ప్రీమియం. కంపెనీ ప్రకారం.. హ్యుందాయ్ క్రెటా EX (O) లో పనోరమిక్ సన్‌రూఫ్, LED రీడింగ్ ల్యాంప్ అందించారు. క్రెటా కొత్త వేరియంట్‌గా కూడా పరిచయం చేశారు.

దీనిలో కొత్తగా ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, 8 వే పవర్ డ్రైవర్ సీటు, బోస్ ప్రీమియం 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు చేర్చారు. అంతే కాకుండా, హ్యుందాయ్ క్రెటా SX (O) వేరియంట్‌లో రెయిన్ సెన్సార్, వెనుక వైర్‌లెస్ ఛార్జర్, స్కూప్డ్ సీట్లు ఇచ్చారు. స్మార్ట్ కీతో కూడిన మోషన్ సెన్సార్ వంటి ఫీచర్లు S(O) వేరియంట్‌లో చేర్చారు. ఈ SUV టైటాన్ గ్రే మ్యాట్‌తో స్టార్రీ నైట్ కలర్‌లో పరిచయం చేశారు.

హ్యుందాయ్ క్రెటా EX (O) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.97 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే దీని SX ప్రీమియంఎక్స్-షోరూమ్ ధర రూ. 16.18 లక్షల నుండి మొదలువుతుంది. క్రెటా ఎస్‌యూవీ కొత్త వేరియంట్‌ ధర రూ. 20.18 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది.

Tags:    

Similar News