హ్యుందాయ్ ఆరా కార్పొరేట్ వేరియంట్.. ఈ కొత్త ఫీచర్లు చూశారా?

Update: 2025-02-09 10:00 GMT

Hyundai Aura Corporate Variant: హ్యుందాయ్ ఆరా కార్పొరేట్ వేరియంట్.. ఈ కొత్త ఫీచర్లు చూశారా?

Hyundai Aura Corporate Variant: హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ. కంపెనీ ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లతో దేశీయ విపణిలో వివిధ రకాల కార్లను విక్రయిస్తోంది. హ్యుందాయ్ కంపెనీ విక్రయిస్తున్న ప్రముఖ కార్లలో 'ఆరా' ప్రముఖ సెడాన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ కారులో కొత్త వేరియంట్ కూడా లాంచ్ అయింది. ఈ కారు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

కొత్త హ్యుందాయ్ ఆరా కార్పొరేట్ వేరియంట్ సరసమైన ధరలో అమ్మకానికి వచ్చింది. ఆరా పెట్రోల్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.48 లక్షలు, సిఎన్‌జి మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.47 లక్షలుగా ఉంది. ఈ కారులో ఐదుగురు సులభంగా ప్రయాణించవచ్చు.

ఈ హ్యుందాయ్ ఆరా కార్పొరేట్ వేరియంట్ 2 పవర్‌ట్రెయిన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 83 హెచ్‌పి హార్స్ పవర్, 114 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మరో 1.2-లీటర్ CNG ఇంజన్ 69 హెచ్‌పి హార్స్ పవర్, 95 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, రెండు మోడళ్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. కారు 17 నుండి 28.4 kmpl మైలేజ్ ఇస్తుంది. 

కొత్త ఆరా కారులో 6.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, 15-అంగుళాల స్టీల్ వీల్స్, అరుదైన వింగ్ స్పాయిలర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రేర్ ఏసీ వెంట్‌లు, ఇంటిగ్రేటెడ్ కప్ హోల్డర్‌లు, ఆర్మ్‌రెస్ట్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఆరా E, S, SX, SX (O) వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అలానే ఫియరీ రెడ్, టైఫూన్ సిల్వర్, స్టార్రీ నైట్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, టీల్ బ్లూ వంటి కలర్ ఆప్షన్లు కారులో ఉన్నాయి.

అలానే హ్యుందాయ్ ఆరా కార్పొరేట్ వేరియంట్ విడుదల చేయడం దేశీయ వినియోగదారులకు చాలా ఆనందాన్ని ఇస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈ కారులో సరికొత్త డిజైన్, ఫీచర్లు ఉన్నందున పెద్ద సంఖ్యలో అమ్మకాలు ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, టాటా టిగోర్ ఈ హ్యుందాయ్ ఆరా సెడాన్‌కు పోటీగా నిలుస్తాయి.

Tags:    

Similar News