Hyundai IONIQ 5: పాపం హ్యుందాయ్.. భారీగా పడిపోయిన ఐయోనిక్ 5 అమ్మకాలు

Hyundai IONIQ 5: ఇండియాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ కార్ల తయారీలో మారుతి సుజుకి తర్వాత రెండో స్థానంలో ఉంది.

Update: 2025-02-11 11:12 GMT

Hyundai IONIQ 5: ఇండియాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ కార్ల తయారీలో మారుతి సుజుకి తర్వాత రెండో స్థానంలో ఉంది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి దేశీయ ఆటోమొబైల్ కంపెనీలను కూడా అధిగమించింది. గత నెలలో హ్యుందాయ్ కంపెనీ మొత్తం 59,858 కార్లను విక్రయించింది. 2024లో ఇదే సమయంలో విక్రయించిన 52,906 యూనిట్లతో పోల్చితే, ఏడాది ప్రాతిపదికన 12.85శాతం వృద్ధిని చూపిస్తుంది.

హ్యుందాయ్ కంపెనీ నిరంతరం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఐయోనిక్ అమ్మకాలు రోజురోజుకు తగ్గుతున్నాయి. గత నెలలో ఐయోనిక్ 5 కార్లలో కేవలం 16 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. జనవరి 2024 నెలలో విక్రయించిన 95 యూనిట్లతో పోలిస్తే, అమ్మకాల 83శాతం క్షీణించాయి. ఈ నెలలో అమ్మకాల సంఖ్య తగ్గింది. డిసెంబర్ 2024లో విక్రయించిన 24 యూనిట్లతో పోలిస్తే 33.33శాతం తగ్గింది. అలాగే నవంబర్‌లో 22 యూనిట్లు, అక్టోబర్‌లో 32 యూనిట్లు, సెప్టెంబర్‌లో 31 యూనిట్లు, ఆగస్టులో 40 యూనిట్లు అమ్ముడయ్యాయి.

హ్యూందాయ్ అయోనిక్ 5 ఫీచర్స్

హ్యుందాయ్ ఐయోనిక్ ఎలక్ట్రిక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.46.05 లక్షలుగా ఉంది. గ్రావిటీ గోల్డ్ మ్యాట్, ఆప్టిక్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ పెర్ల్, టైటాన్ గ్రే కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో 72.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ 217 పిఎస్‌ పవర్, 350 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలానే రేర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ కూడా ఉంది. ఫుల్ ఛార్జ్‌పై 631 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

కొత్త హ్యుందాయ్ ఐయోనిక్ 5లో ఐదు సీట్లు ఉన్నాయి. కాబట్టి, ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. లగేజీని తీసుకెళ్లడానికి 527 లీటర్ల కెపాసిటీ బూట్ స్పేస్‌ అందించారు. ఇతర ఫీచర్లలో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ డిస్‌ప్లేలు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి.

భద్రత పరంగా హ్యుందాయ్ ఐయోనిక్‌లో 6-ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్. 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

Tags:    

Similar News