Hyundai Creta: జూన్‌లో రికార్డు అమ్మకాలు.. దేశంలోనే నెం.1 బెస్ట్ సెల్లింగ్ SUV!

భారతీయులలో SUVలంటే మక్కువ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ ట్రెండ్‌ను బాగా క్యాష్ చేసుకున్న హుందాయ్ క్రెటా, జూన్ 2025లో తన విజయ పరంపరను మరోసారి కొనసాగించింది.

Update: 2025-07-02 13:17 GMT

Hyundai Creta: జూన్‌లో రికార్డు అమ్మకాలు.. దేశంలోనే నెం.1 బెస్ట్ సెల్లింగ్ SUV!

Hyundai Creta: భారతీయులలో SUVలంటే మక్కువ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ ట్రెండ్‌ను బాగా క్యాష్ చేసుకున్న హుందాయ్ క్రెటా, జూన్ 2025లో తన విజయ పరంపరను మరోసారి కొనసాగించింది. ఈ మిడ్ సైజ్ SUV జూన్ నెలలో ఏకంగా 15,786 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసి, దేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్‌గా నిలిచింది. మార్చి, ఏప్రిల్ నెలలకే కాదు, జూన్‌లోనూ అదే స్థాయిలో అమ్మకాల ఊపు కొనసాగింది.

2015లో భారత్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి క్రెటా భారత మార్కెట్లో విశేష ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం టాటా కర్వ్, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టయోటా హైరైజర్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, ఎంజీ అస్టర్ లాంటి వాహనాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, హుందాయ్ క్రెటా తన స్థానాన్ని కాపాడుకుంది.

హుందాయ్ మోటార్స్ COO తరుణ్ గార్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు 12 లక్షలపైగా కుటుంబాలు హుందాయ్ క్రెటాను స్వంతం చేసుకున్నాయి. కంపెనీకి SUV అమ్మకాలు వెన్నెముకగా మారాయని, గత 10 ఏళ్లుగా క్రెటా తన స్థిరమైన ప్రదర్శనతో మార్కెట్లో టాప్ ప్లేస్‌లో నిలుస్తోందని ఆయన తెలిపారు.

కస్టమర్ అనుభూతిని మరింత మెరుగుపరచేందుకు, కంపెనీ త్వరలోనే క్రెటాలో కొత్త ఫీచర్లు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా చూస్తే, భారతీయ SUV మార్కెట్‌లో క్రెటా మరోసారి తనదైన ముద్ర వేసిందని చెప్పవచ్చు.

Tags:    

Similar News