Honda: హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ టీజర్ రిలీజ్.. ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో సెప్టెంబర్ 2న లాంచ్
హోండా మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ గురించి తాజాగా ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో మంచి స్పందన పొందిన హోండా కంపెనీ, ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో కూడిన కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ఈ బైక్‌ను గ్లోబల్‌గా ఆవిష్కరించనుంది.

ఇందుకు సంబంధించిన టీజర్‌ను హోండా విడుదల చేసింది. ఇందులో బైక్ టాప్ ఫీచర్స్‌ను హైలైట్ చేస్తూ చూపించారు. ముఖ్యంగా TFT డిజిటల్ డాష్, సమాంతరంగా ఉన్న LED DRL, సింగిల్-సైడెడ్ స్వింగ్ ఆర్మ్, 17 అంగుళాల చక్రాలు, 150 సెక్షన్ పిరెల్లి రోస్సో 3 టైర్లు ఉండనున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. చివర్లో వినిపించిన ఆడియో క్లిప్ ఇది ఎలక్ట్రిక్ బైక్ అని నిర్ధారిస్తోంది.
గత ఏడాది EICMA ఈవెంట్‌లో హోండా ప్రదర్శించిన EV ఫన్ కాన్సెప్ట్ బైక్ పనితీరు 500cc మోటార్‌సైకిల్‌కి సమానమని ప్రకటించగా, ఇప్పుడు విడుదలవుతున్న ఉత్పత్తి మోడల్‌లో కూడా అదే స్థాయిలో పనితీరు కనిపించనుందని భావిస్తున్నారు.
ఈ బైక్ మొదటగా యూరప్ మార్కెట్‌లో రిలీజ్ అవుతుంది. అనంతరం భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి రానుంది.