Honda Teases X-ADV 750: రాబందు దిగింది.. హోండా అడ్వెంచర్ స్కూటర్ లాంచ్.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు..!
Honda Teases X-ADV 750: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా X-ADV అడ్వెంచర్ స్కూటర్‌ను విడుదల చేసి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది.
Honda Teases X-ADV 750: రాబందు దిగింది.. హోండా అడ్వెంచర్ స్కూటర్ లాంచ్.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు..!
Honda Teases X-ADV 750: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా X-ADV అడ్వెంచర్ స్కూటర్‌ను విడుదల చేసి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రత్యేకత ఏమిటంటే కంపెనీ తన టీజర్‌ను ఒక రోజు ముందే విడుదల చేసింది. ఈ ప్రీమియం మ్యాక్సీ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.11.90 లక్షలుగా నిర్ణయించారు. X-ADV అనేది మ్యాక్సీ-స్కూటర్ సౌలభ్యాన్ని అడ్వెంచర్ బైక్ కఠినమైన ఆకర్షణతో మిళితం చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో దీని బుకింగ్ ప్రారంభమైంది. దీని డెలివరీ జూన్ 2025లో ప్రారంభమవుతుంది.
హోండా X-ADV ఫ్యూచరిస్టిక్ క్రాస్ఓవర్ డిజైన్‌తో విడుదలైంది. డీఆర్ఎల్‌లు, ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్‌లతో డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ల ద్వారా హైలైట్ చేశారు. దీనిలో 17-అంగుళాల ముందు, 15-అంగుళాల వెనుక స్పోక్ వీల్స్ ఉన్నాయి. 22-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌లో USB-C ఛార్జర్ అందించారు. ఇది రోజువారీ ఉపయోగం కోసం ఆచరణాత్మకతను పెంచుతుంది. ఈ సీటు మెరుగైన ప్యాడింగ్, తక్కువ రీచ్‌తో రూపొందించారు. కొనుగోలుదారులు పెర్ల్ గ్లేర్ వైట్,గ్రాఫైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ల నుండి ఎంచుకోవచ్చు, ఈ రెండూ X-ADV ప్రీమియం లక్షణాన్ని ప్రతిబింబిస్తాయి.
కాక్‌పిట్ లోపల, హోండా రోడ్‌సింక్‌తో కూడిన 5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్, మ్యూజిక్/వాయిస్ కంట్రోల్స్‌ను అందిస్తుంది. X-ADV 43.1 పవర్, 69 ఎన్ఎమ్ ఉత్పత్తి చేసే 745సీసీ ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది, ఇది హోండా 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)కి జతచేసి, సాఫీగా ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ కోసం రూపొందించారు. హోండా తన ప్రీమియం బిగ్‌వింగ్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. భారతదేశంలో పనితీరు, జీవనశైలి ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం దీని లక్ష్యం.
ఈ స్కూటర్‌లో నాలుగు రైడింగ్ మోడ్‌లను అందించింది. వాటిలో స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, గ్రావెల్ ఉన్నాయి. రైడ్-బై-వైర్ ద్వారా కంట్రోల్ చేసే కస్టమైజ్డ్ యూజర్ మోడ్ పొందుతారు. ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్‌తో భద్రత, పనితీరును మెరుగుపరిచింది. దీని ఛాసిస్‌లో ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్, 41మి.మీ యూఎస్‌డి ఫ్రంట్ ఫోర్కులు, ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్‌ను రేడియల్ కాలిపర్‌లతో కూడిన డ్యూయల్ 296మి.మీ ఫ్రంట్ డిస్క్‌లు, 240మిమీ వెనుక డిస్క్ చూడచ్చు.