Honda Rebel 500 Launch: భారత రోడ్లపై రెబెల్.. స్టన్నింగ్ లుక్స్‌తో లాంచ్.. సరికొత్త రైడ్‌కు సిద్దం కండి..!

Honda Rebel 500 Launch: జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లో వివిధ విభాగాలలో వాహనాలను విక్రయిస్తుంది. కంపెనీ ఇటీవల శక్తివంతమైన ఇంజిన్‌తో కొత్త బైక్‌ను విడుదల చేసింది.

Update: 2025-05-19 15:30 GMT

Honda Rebel 500 Launch: భారత రోడ్లపై రెబెల్.. స్టన్నింగ్ లుక్స్‌తో లాంచ్.. సరికొత్త రైడ్‌కు సిద్దం కండి..!

Honda Rebel 500 Launch: జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లో వివిధ విభాగాలలో వాహనాలను విక్రయిస్తుంది. కంపెనీ ఇటీవల శక్తివంతమైన ఇంజిన్‌తో కొత్త బైక్‌ను విడుదల చేసింది. హోండా రెబెల్ 500 అనే 500 సిసి విభాగంలో కొత్త క్రూయిజర్ బైక్‌ను తీసుకొచ్చింది. దీని డెలివరీని కూడా కంపెనీ త్వరలో ప్రారంభించనుంది. ఈ క్రమంలో బైక్‌లో ఎటువంటి ఇంజిన్ ఉంటుంది, ధర ఎంత, ఎలాంటి ఫీచర్లు ఉంటాయి. తదితర వివరాలు తెలుసుకుందాం.

Honda Rebel 500 Engine

హోండా రెబెల్ 500 బైక్‌లో 471 సిసి లిక్విడ్ కూల్డ్ ఫోర్ సిలిండర్, ఎనిమిది వాల్వ్ ఇంజిన్ ఉంది. దీని కారణంగా ఈ బైక్ 34 కిలోవాట్ల పవర్, 43.3 న్యూటన్ మీటర్ల టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. సమాంతర ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ బైక్‌లో సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.

Honda Rebel 500 Features

ఈ కొత్త బైక్‌లో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ ఇండికేటర్లు, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు, రెండు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్ ఛానల్ యాంటి లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, 16 అంగుళాల టైర్లు, ఎల్‌సీడీ డిస్‌ప్లే, 690 మి.మీ సీట్ ఎత్తు వంటి ఫీచర్లను అందించారు

కొత్త బైక్ ఆవిష్కరణ సందర్భంగా హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ, "రెబెల్ 500 ను భారతదేశానికి తీసుకురావడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. రైడింగ్ ఔత్సాహికులు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మోటార్ సైకిల్ ఇది, రెబెల్ 500, కాలానుగుణ క్రూయిజర్ స్టైలింగ్‌ను ఆధునిక మెరుగులతో మిళితం చేస్తుంది, ఇది ప్రేక్షకుల నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది.

Honda Rebel 500 Price

హోండా రెబెల్ 500 ఒకే ఒక వేరియంట్‌లో విడుదల చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.12 లక్షలు. ఈ బైక్‌ను హోండా ప్రీమియం డీలర్‌షిప్ బిగ్ వింగ్ ద్వారా అందిస్తారు. ప్రస్తుతం, బైక్ బుకింగ్ ప్రారంభమైంది. దాని డెలివరీ జూన్ 2025 నుండి ప్రారంభమవుతుంది. హోండా కొత్త బైక్ రెబెల్ 500 500 సిసి విభాగంలో విడుదలైంది. ఈ బైక్ భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650, షాట్‌గన్ 650, సూపర్ మీటియోర్ 650, కవాసకి ఎలిమినేటర్ వంటి క్రూయిజర్ బైక్‌లతో నేరుగా పోటీపడుతుంది.

Tags:    

Similar News