Honda Goldwing 50Th Anniversary Edition: భారత్లో 'గోల్డ్ వింగ్' 50వ వార్షికోత్సవ ఎడిషన్.. దీని ధరకు బెంజ్ కారు కొనేయొచ్చు.. రేటెంతో తెలుసా..?
Honda Goldwing 50Th Anniversary Edition: హోండా మోటార్‌సైకిల్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దాని ఐకానిక్ టూరింగ్ బైక్ హోండా గోల్డ్‌వింగ్ ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది.
Honda Goldwing 50Th Anniversary Edition: భారత్లో 'గోల్డ్ వింగ్' 50వ వార్షికోత్సవ ఎడిషన్.. దీని ధరకు బెంజ్ కారు కొనేయొచ్చు.. రేటెంతో తెలుసా..?
Honda Goldwing 50Th Anniversary Edition: హోండా మోటార్‌సైకిల్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దాని ఐకానిక్ టూరింగ్ బైక్ హోండా గోల్డ్‌వింగ్ ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. హోండా గోల్డ్ వింగ్ 50వ వార్షికోత్సవ ఎడిషన్ ను అనేక గొప్ప ఫీచర్లతో విడుదల చేశారు. దీనికి కొత్త రంగు ఇవ్వడంతో పాటు, ఇది అనేక గొప్ప ఫీచర్లు అందించారు. కొత్త గోల్డ్ వింగ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో తెలుసుకుందాం.
హోండా గోల్డ్‌వింగ్‌ను మొదట 1975 సంవత్సరంలో ప్రారంభించారు, అప్పటి నుండి ఈ లగ్జరీ టూరింగ్ బైక్ ప్రపంచంలోనే పెద్ద పేరుగా మారింది. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, హోండా దీనికి కొత్త రూపాన్ని ఇచ్చింది. దీనికి కొత్త బోర్డియక్స్ మెటాలిక్ రెడ్ కలర్ ఇచ్చారు. ఇది మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. బైక్‌లో అనేక ఇతర మార్పులు చేశారు. ఇది 1975 నుండి యానిమేషన్‌తో 7-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. '50వ వార్షికోత్సవం' గ్రాఫిక్ కూడా దాని కీ-ఫోబ్‌లో ఇచ్చారు.
ఇది అదే పాత 1883సీసీ, ఫ్లాట్-సిక్స్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉంది, ఇది 26.4 హార్స్‌పవర్, 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 7-స్పీడ్ DCTకి జతచేయబడింది. ఇందులో రివర్స్ గేర్ కూడా ఉంటుంది.
ఇది ఎల్లప్పుడూ హై-టెక్ ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. ఈ కొత్త ఎడిషన్‌లో 7.0-అంగుళాల TFT డిస్ప్లే ఉంది, ఇది యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ ఇస్తుంది. ఈ బైక్ రైడర్, పిలియన్ భద్రత కోసం అనేక భద్రతా లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, రైడ్-బై-వైర్ సిస్టమ్, నాలుగు రైడింగ్ మోడ్‌లు (టూర్, స్పోర్ట్, ఎకాన్ మరియు రెయిన్) అలాగే ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.
హోండా గోల్డ్‌వింగ్ 50వ వార్షికోత్సవ ఎడిషన్ భారతదేశంలో రూ. 39.90 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభించారు. ఇది ప్రామాణిక గోల్డ్ వింగ్ టూర్ కంటే రూ. 70 వేలు ఎక్కువ. అయితే, ప్రామాణిక గోల్డ్ వింగ్ టూర్ ధర ఇప్పటికే రూ. 39.70 లక్షల నుండి రూ. 39.20 లక్షలకు తగ్గించారు. ఈ బైక్ కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, డెలివరీలు జూన్ 2025 నుండి ప్రారంభమవుతాయి.