Honda Activa e And QC1 Sale: హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. అమ్మకాలు అంతంతే.. ఎందుకో తెలుసా..!
Honda Activa e And QC1 Sales: రెండు నెలల్లో హోండా తన యాక్టివా e , QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లు 2,662 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
Honda Activa e And QC1 Sale: హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. అమ్మకాలు అంతంతే.. ఎందుకో తెలుసా..!
Honda Activa e And QC1 Sales: రెండు నెలల్లో హోండా తన యాక్టివా e , QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లు 2,662 యూనిట్లను మాత్రమే విక్రయించింది. హోండా ఇటీవలే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశించింది. కంపెనీ ఫిబ్రవరి,మార్చి 2025 మధ్య 6,400 కంటే ఎక్కువ యాక్టివా e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేసింది. అయితే ఇందులో 2,662 యూనిట్లను మాత్రమే అమ్ముడయ్యాయి. ఊహించిన దానికంటే ఖరీదైన యాక్టివా e ప్రస్తుతం బెంగళూరు మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు దాని బుకింగ్ ముంబై, ఢిల్లీలో కూడా ప్రారంభమైంది. మరోవైపు, QC1ని ఇప్పటివరకు ఆరు నగరాల నుండి కొనుగోలు చేయవచ్చు - హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, ఢిల్లీ, చండీగఢ్.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (SIAM) విడుదల చేసిన FY2025 టోకు అమ్మకాల డేటా ప్రకారం, HMSI మొత్తం 6,432 యూనిట్ల యాక్టివా e, QC1లను ఉత్పత్తి చేసింది. ఈ కంపెనీ ఫిబ్రవరి 2025లో 1,862 యూనిట్లను, మార్చి 2024లో 4,570 యూనిట్లను ఉత్పత్తి చేసింది. కాగా, కంపెనీ ఫిబ్రవరి 2025లో 560 యూనిట్లను పంపింది. మార్చి 2025లో 2,102 యూనిట్లను HMSI డీలర్లకు పంపింది. ఈ ఈ-స్కూటర్‌ను కర్ణాటకలోని HMSI నర్సపుర ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. హోండా యాక్టివా E లో మార్చుకోగల బ్యాటరీ ఉంది, అయితే QC1 లో స్టాండర్డ్ బ్యాటరీ ఉంది.
Honda Activa e Features And Specifications
యాక్టివా e ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5కిలోవాట్ మార్పుకోగల డ్యూయల్ బ్యాటరీ సెటప్‌తో వస్తుంది. ఈ రెండు బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ చేస్తే 102 కిమీల రేంజ్ ఇస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీలు 6kW ఫిక్స్‌డ్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తాయి. ఇది 22ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి - ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్. దీని గరిష్ట వేగం గంటకు 80 కిమీ. అదే సమయంలో ఇది 7.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. దీనికి 7 అంగుళాల TFT స్క్రీన్ ఉంది. స్క్రీన్ నావిగేషన్‌కు సపోర్ట్ ఇస్తుంది.
Honda QC1 Features And Specifications
QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో స్టాండర్డ్ 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది . ఇందులో హోండా రోడ్ సింక్ డుయో యాప్‌తో రియల్ టైమ్ కనెక్టివిటీని అందించే 7.0-అంగుళాల TFT స్క్రీన్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్ 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని పవర్ అవుట్‌పుట్ 1.2 kW (1.6 bhp), 1.8 kW (2.4 bhp). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుండి 75శాతం వరకు ఛార్జ్ కావడానికి 3 గంటలు పడుతుంది. అయితే, పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 6 గంటలే పడుతుంది.