Nissan Magnite Big Discount: త్వరపడండి.. ఈ ఆఫర్ పోతే మళ్లీ రాదు.. నిస్సాన్ మాగ్నైట్‌పై భారీ ఆఫర్..!

Nissan Magnite Big Discount: భారత్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఎస్‌యూవీలు స్పోర్ట్ యుటిలిటీ వాహనాల దిగువన ఉంటాయి.

Update: 2025-02-18 10:00 GMT

Nissan Magnite Big Discount: భారత్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఎస్‌యూవీలు స్పోర్ట్ యుటిలిటీ వాహనాల దిగువన ఉంటాయి. ఈ వాహనాలకు ఉన్న డిమాండ్ కారణంగా వాహన తయారీ కంపెనీలు ఈ విభాగంలో అనేక కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఇటువంటి అనేక ఎస్‌యూవీలు ఉన్నాయి. వీటిలో టాటా, కియా నుంచి నిస్సాన్, హ్యుందాయ్ వరకు కార్లు ఉన్నాయి. కానీ నిస్సాన్ మాగ్నైట్ ఈ సెగ్మెంట్‌లో డబ్బుకు విలువైన కారుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో మీరు మాగ్నైట్ ఎస్‌యూవీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే రూ. 70 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.12 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నిస్సాన్ మాగ్నైట్‌లో రెండు పెట్రోల్ ఇంజన్లు ఉంటాయి. ఇందులో 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0L నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్లు 6-స్పీడ్ MT లేదా CVT గేర్‌బాక్స్‌తో వస్తాయి. మాగ్నైట్ మీకు 20kmpl వరకు మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం ఈ మాగ్నైట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, చైల్డ్ సీట్ మౌంట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ దాని విభాగంలో అత్యుత్తమంగా కనిపించే ఎస్‌యూవీలలో ఒకటి. ఇందులో చాలా స్థలం కూడా అందుబాటులో ఉంది. ఈ కారులో 5 మంది సులభంగా కూర్చోవచ్చు. ఇంటీరియర్ విషయానికి వస్తే.. మాగ్నైట్‌లోని 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఇప్పుడు కొత్త గ్రాఫిక్స్ కనిపిస్తాయి. కొత్త మాగ్నైట్‌లో సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంది. అలానే కొత్త కీ కూడా అందించారు. ఆటో లాక్, అప్రోచ్ అన్‌లాక్, రిమోట్ స్టార్ట్‌‌కు ఈ కీ సపోర్ట్ చేస్తుంది.

నిస్సాన్ మాగ్నైట్ టాటా పంచ్‌తో నేరుగా పోటీపడుతుంది. ఇంజన్ విషయానికి వస్తే.. పంచ్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 72.5పిఎస్ పవర్, 103 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒక లీటర్‌లో 20.09 కిమీ మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం ఇందులో కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్స్, మాత్రమే ఉన్నాయి. పంచ్ ధర రూ.6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Tags:    

Similar News