Up Coming Cars: డబ్బులు రెడీ చేస్కోండి.. త్వరలో రోడ్లపైకి రానున్న 12 కొత్త కార్లు ఇవే!

Up Coming Cars: కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఎందుకంటే, రాబోయే 12 నెలల్లో మన దేశ మార్కెట్లోకి ఏకంగా 12 కొత్త ఎస్‌యూవీలు వస్తున్నాయి.

Update: 2025-07-03 11:39 GMT

Up Coming Cars: కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఎందుకంటే, రాబోయే 12 నెలల్లో మన దేశ మార్కెట్లోకి ఏకంగా 12 కొత్త ఎస్‌యూవీలు వస్తున్నాయి. ఇప్పుడు అందరూ ఎస్‌యూవీలనే ఇష్టపడుతున్నారు కదా..అందుకే హ్యుందాయ్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎస్‌యూవీల తయారీపైనే ఫుల్ ఫోకస్ పెట్టేశాయి. కొన్ని కంపెనీలు సరికొత్త మోడల్స్‌ను తీసుకొస్తుంటే.. మరికొన్ని పాత మోడల్స్‌కు కొత్త లుక్ (ఫేస్‌లిఫ్ట్) ఇచ్చి మార్కెట్‌లోకి దించుతున్నాయి.

మారుతి సుజుకి నుంచి రెండు అదిరిపోయే కార్లు వస్తున్నాయి. ఒకటి, గ్రాండ్ విటారా కంటే కొంచెం చిన్నదైన కొత్త 5 సీటర్ ఎస్‌యూవీ. ఇది హైబ్రిడ్ ఆప్షన్లలో వస్తుంది. ఇంకోటి, మారుతి మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారా, ఇది ఈ పండుగల సీజన్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ కూడా తమ పాపులర్ వెన్యూ కారుకు కొత్త మోడల్‌ను తీసుకురాబోతోంది. దీని డిజైన్, ఫీచర్లు మారినా ఇంజిన్ మాత్రం అదే ఉంటుందంట.

టాటా మోటార్స్ అయితే ఏకంగా నాలుగు కొత్త కార్లను సిద్ధం చేస్తోంది. హారియర్, సఫారీ కార్లకు కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్‌లు రాబోతున్నాయి. వీటితో పాటు, టాటా సియెరా అనే కారును దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌తో పాటు, పెట్రోల్/డీజిల్ వెర్షన్‌లో కూడా తీసుకురాబోతోంది. మహీంద్రా కూడా తమ ఫ్యాన్స్‌ను నిరాశపరచడం లేదు. XUV700 కు కొత్త అప్‌డేట్ ఇస్తున్నారు. అంతేకాదు, XUV3XO EV, XEV 7e అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు, 3-డోర్ థార్ కు కొత్త లుక్, బోలెరో నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను కూడా తీసుకురాబోతున్నారు.

Tags:    

Similar News