Indian Cars: 200 కిమీల మేలేజీలతో దుమ్మురేపుతోన్న మేడ్ ఇన్ ఇండియా కార్లు.. లిస్టు చూస్తే పరేషాన్ అవ్వాల్సిందే భయ్యా..

Indian Cars with Top Speed: ప్రజలు కారును కొనుగోలు చేసే ముందు దాని ఫీచర్ల గురించి సమాచారాన్ని సేకరించాలని కోరుకుంటారు.

Update: 2024-04-27 02:30 GMT

Indian Cars: 200 కిమీల మేలేజీలతో దుమ్మురేపుతోన్న మేడ్ ఇన్ ఇండియా కార్లు.. లిస్టు చూస్తే పరేషాన్ అవ్వాల్సిందే భయ్యా..

Indian Cars with Top Speed: ప్రజలు కారును కొనుగోలు చేసే ముందు దాని ఫీచర్ల గురించి సమాచారాన్ని సేకరించాలని కోరుకుంటారు. 200 kmph కంటే ఎక్కువ వేగాన్ని ఇచ్చే కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కార్ల జాబితాలో హ్యుందాయ్, వోక్స్‌వ్యాగన్, జీప్, స్కోడా వాహనాలు కూడా ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఇలాంటి కార్ల జాబితాలో చేరింది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 200 కి.మీ. Volkswagen Virtus ఎక్స్-షోరూమ్ ధర రూ.11,55,900 నుంచి ప్రారంభమవుతుంది.

మహీంద్రా XUV700 కూడా ఈ టాప్-స్పీడ్‌తో మార్కెట్లో ఉంది. ఈ కారులో వరల్డ్ క్లాస్ సేఫ్టీ వంటి ఫీచర్లతో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్ సదుపాయం ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

జీప్ కంపాస్ 21.3 సెం.మీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో ఈ కారును రూపొందించారు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 210 కి.మీ. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.20.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మార్కెట్‌లో స్కోడా స్లావియా పెట్రోల్ ఇంజన్ నాలుగు వేరియంట్‌లు ఉన్నాయి. ఈ కారు గరిష్టంగా 200 kmph వేగాన్ని అందిస్తోంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.11,53,400లుగా ఉంది.

హ్యుందాయ్ వెన్యూ టాప్-స్పీడ్ 210 kmph. ఈ కారులో 26.03 సెం.మీ HD ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 11 లక్షల నుంచి మొదలై రూ. 17.42 లక్షల వరకు ఉంటుంది.

Tags:    

Similar News