Maruti Cars: ఆల్టో నుంచి వ్యాగన్ ఆర్ వరకు.. 35 కి.మీ.ల మైలేజీ ఇచ్చే మారుతీ కార్లు ఇవే..!

Maruti Car's Mileage: దేశంలోని ఎంట్రీ లెవల్ కార్ల గురించి మాట్లాడితే, ముందుగా వచ్చే పేరు మారుతి సుజుకి. బడ్జెట్ కార్లను అందించడంలో మారుతీ సుజుకీ ముందు వరుసలో ఉంటుంది.

Update: 2023-10-05 15:30 GMT

Maruti Cars: ఆల్టో నుంచి వ్యాగన్ ఆర్ వరకు.. 35 కి.మీ.ల మైలేజీ ఇచ్చే మారుతీ కార్లు ఇవే..! 

Maruti Alto, Wagon R, Swift, Dzire Mileage: దేశంలోని ఎంట్రీ లెవల్ కార్ల గురించి మాట్లాడితే, ముందుగా వచ్చే పేరు మారుతి సుజుకి. బడ్జెట్ కార్లను అందించడంలో మారుతీ సుజుకీ ముందు వరుసలో ఉంటుంది. ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్లో, మారుతి ఆల్టో కె10, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, సెలెరియో వంటి అనేక వాహనాలను కలిగి ఉంది. అయితే, మారుతి ఆల్టో కె10, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, సెలెరియోలలో ఏ కారు అత్యధిక మైలేజీని ఇస్తుందో తెలుసా. ఈ కార్లలో ఒకటి 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది.

మారుతి ఆల్టో K10..

మీరు మారుతి ఆల్టో K10 పెట్రోల్ (MT) వేరియంట్‌ తీసుకుంటే, ఇది లీటరుకు 24.39 కి.మీ.ల మైలేజీ ఇస్తుంది. ఇది కాకుండా, ఈ కారు CNGలో కిలోగ్రాముకు 33.85 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించగలదు.

మారుతి వ్యాగన్ఆర్..

మారుతి వ్యాగన్ఆర్ మైలేజీ పెట్రోల్ (మాన్యువల్) వేరియంట్‌ల నుంచి లీటరుకు 24.35 కిమీ వరకు మైలేజీ వస్తుంది. పెట్రోల్ (AMT) వేరియంట్‌ల నుంచి లీటరుకు 25.19 కిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో, పెట్రోల్-CNG వేరియంట్ కిలోగ్రాముకు 34.05 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.

మారుతీ స్విఫ్ట్..

మారుతి స్విఫ్ట్ పెట్రోల్ (మాన్యువల్) వేరియంట్లు లీటరుకు 23.20 కిమీల మైలేజీ ఇస్తుంది. అలాగే, పెట్రోల్ (AMT) వేరియంట్లు లీటరుకు 23.76 కిమీల మైలేజీని ఇవ్వగలవు. అలాగే CNGపై 30.90 కిమీల మైలేజీని అందిస్తుంది.

మారుతీ డిజైర్..

మారుతి డిజైర్ మాన్యువల్ వేరియంట్లు 23.26 kmplల మైలేజీ ఇస్తుంది. AMT వేరియంట్లు 24.12 kmpl మైలేజీని ఇవ్వగలవు. అలాగే CNGలో కిలోగ్రాముకు 31.12 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు.

మారుతి సెలెరియో..

మారుతి సెలెరియో పెట్రోల్ (MT) వేరియంట్లు 25.24 kmplలకు వరకు, పెట్రోల్ (AMT) వేరియంట్లు 26.68 kmpl వరకు మైలేజీని ఇవ్వగలవు. దీని CNG వేరియంట్ కిలోగ్రాముకు 35.6 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు.

Tags:    

Similar News