Hyundai i20 : బలెనో, స్విఫ్ట్‌లకు పోటీ.. హ్యుందాయ్ ఈ కారు పై ఏకంగా రూ.70000 తగ్గింపు

Hyundai i20 : కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇదే మంచి టైం. దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన హుందాయ్ మోటార్ ఇండియా ఈ నెలలో తన అనేక పాపులర్ మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.

Update: 2025-07-12 06:00 GMT

Hyundai i20 : బలెనో, స్విఫ్ట్‌లకు పోటీ.. హ్యుందాయ్ ఈ కారు పై ఏకంగా రూ.70000 తగ్గింపు

Hyundai i20 : కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇదే మంచి టైం. దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన హుందాయ్ మోటార్ ఇండియా ఈ నెలలో తన అనేక పాపులర్ మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. వాటిలో ఒకటి కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హుందాయ్ i20, దీనిపై వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు.

హుందాయ్ అందిస్తున్న ఈ ఆఫర్‌లో i20 కొనుగోలుపై కస్టమర్‌లకు మొత్తం రూ.70,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపులు వివిధ ప్రయోజనాల రూపంలో ఉంటాయి. అవి: క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కొన్ని సందర్భాల్లో కార్పొరేట్ డిస్కౌంట కూడా ఉండవచ్చు. అయితే, ఈ తగ్గింపులు డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు. కాబట్టి, సరైన సమాచారం కోసం దగ్గరలోని హుందాయ్ డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది.

భారత మార్కెట్‌లో హుందాయ్ i20 మారుతి సుజుకి బలెనో, స్విఫ్ట్ వంటి ప్రజాదరణ పొందిన కార్లతో పోటీపడుతుంది. ఈ రెండు కార్లతో పోలిస్తే i20 ని మరింత ప్రీమియంగా, ఎక్కువ ఫీచర్లు ఉన్న కారుగా పరిగణిస్తారు. అందుకే ఇది హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ పోటీదారుగా నిలిచింది.

హుందాయ్ i20 తన విభాగంలో ప్రీమియం లుక్, ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. ఈ కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, i20 లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

హుందాయ్ i20 లో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది సుమారు 83bhp పవర్, 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందిస్తున్నారు. హుందాయ్ i20 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.04 లక్షలు, అయితే దీని టాప్ మోడల్ ధర రూ.11.25 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు భారతదేశంలో మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రతి వేరియంట్‌లో ఫీచర్లు, ట్రాన్స్‌మిషన్ ఆధారంగా తేడాలు ఉంటాయి.

Tags:    

Similar News