Ultraviolette Tesseract Electric Scooter: అల్ట్రావయోలెట్ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ. 100 ఖర్చుతో 500 కిమీ రేంజ్..!

Ultraviolette Tesseract Electric Scooter: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ అల్ట్రావయోలెట్ తన మొట్టమొదటి హైటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్‌కు "టెసెరాక్ట్" అని పేరు పెట్టారు.

Update: 2025-03-07 00:30 GMT

Ultraviolette Tesseract Electric Scooter: అల్ట్రావయోలెట్ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ. 100 ఖర్చుతో 500 కిమీ రేంజ్..!

Ultraviolette Tesseract Electric Scooter: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ అల్ట్రావయోలెట్ తన మొట్టమొదటి హైటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్‌కు "టెసెరాక్ట్" అని పేరు పెట్టారు. ఈ కొత్త స్కూటర్‌లో అనేక అధునాతన ఫీచర్లు చేర్చారు. ఈ స్కూటర్ 100 రూపాయలతో 500కిమీలు పరుగులు తీస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

Ultraviolette Tesseract Electric Scooter Price

అల్ట్రావయోలెట్ టెసెరాక్ట్‌తో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. టెసెరాక్ట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ. 1.20 లక్షలుగా ఉంది. ఈ ధరమొదటి 10,000 మంది కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఆ తర్వాత దీని ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

Ultraviolette Tesseract Electric Scooter Range

అల్ట్రావయోలెట్ టెసెరాక్ట్‌ ఫుల్ ఛార్జ్‌తో 261 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది IDC క్లెయిమ్ చేసిన పరిధి. ఇందులో 20 హెచ్‌పి పవర్ ఇవ్వడానికి ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఈ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలో 0 నుండి 60 kmph వేగాన్ని అందుకోగలదు. టెసెరాక్ట్‌ గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు.

Ultraviolette Tesseract Electric Scooter Features And Specifications

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ కూడా ఫైటర్ జెట్‌ల స్ఫూర్తితో రూపొందించారు. ఫ్లోటింగ్ డీఆర్ఎల్, డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. ఇందులో 3 కలర్ ఆప్షన్లు ఉంటాయి. ఫీచర్ల గురించి మాట్లాడితే.. కొత్త టెస్సెరాక్ట్‌లో విండ్‌స్క్రీన్, 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, ముందు, వెనుక రాడార్ టెక్నాలజీతో కూడిన 34-లీటర్ అండర్‌సీట్ 14-అంగుళాల వీల్స్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఓవర్‌టేక్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్, రియర్ కొలిజన్ అలర్ట్, ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్, హ్యాండిల్‌బార్ ఫీడ్‌బ్యాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News