PM E-DRIVE: టక్కును కొనండి..9.6 లక్షల డిస్కౌంట్ పొందండి.. పీఎమ్ ఈ డ్రైవ్‌ పథకం కింద ప్రోత్సాహకాలు

PM E-DRIVE: కాలుష్యరహిత వాహనాలు పెంచే దిశగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద భారీ సబ్సిడీతో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చింది.

Update: 2025-07-12 11:30 GMT

PM E-DRIVE: టక్కును కొనండి..9.6 లక్షల డిస్కౌంట్ పొందండి.. పీఎమ్ ఈ డ్రైవ్‌ పథకం కింద ప్రోత్సాహకాలు

PM E-DRIVE: కాలుష్యరహిత వాహనాలు పెంచే దిశగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద భారీ సబ్సిడీతో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చింది. కాలుష్యానికి కారణమయ్యే వాహనాలకు స్వస్తి చెప్పి.. ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించేలా ఈ పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా కొన్ని మార్గదర్శకాలనూ విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ మొబిలిటీ, సుస్థిర రవాహా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎమ్ ఈ డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంతో ఎలక్ట్రిక్ వాహానాలను ఉపయోగించేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారీ వాహనదారులు ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ట్రక్కును కొనుగోలు చేస్తే రూ. 9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ఈ మార్గదర్శకాల ద్వారా తెలిపింది.

కాలుష్యం పెరిగిపోతుంది. రోడ్డుపైకి వెళ్లాలంటే దుమ్ము, దూళి, పొగ. ఇక నగరాల సంగతైతే అసలే చెప్పనవసరం లేదు. విపరీతంగా పెరిగే కాలుష్యంతో ప్రజలు ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతున్నాయి. దీని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పీఎమ్ ఈ డ్రైవ్ పథకం కింద భారీ ట్రక్కులను తీసుకొచ్చింది. ఒక ట్రక్కు కొంటే దాదాపు రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు ప్రకటించింది.

ఇవేకాదు, ఇంకా మార్గదర్శాల్లో ఏం ఉన్నాయంటే.. దేశవ్యాప్తంగా 5, 600 ఎలక్ట్రిక్ ట్రక్కులను ప్రభుత్వం ఈ స్కీమ్ కిందకు తీసుకొచ్చింది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం ఎన్ 2, ఎన్ 3 కేటగిరీ ఈ ట్రక్కులు 3.5 టన్నుల నుంచి 55 టన్నుల బరువు ఉంటే ఇది వర్తిస్తుంది. ట్రక్కులతో పాటు ఎన్ 3 కేటగిరీలోని పుల్లర్ ట్రాక్టర్లకు కూడా ప్రోత్సహకాలు ఇస్తారు.

అయితే వీటికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. పాత ఐసీఈ ట్రక్కు బరువు కొత్త ఈ ట్రక్కు కంటే సమానమైన లేదా ఎక్కువ బరువు ఉండాలి. అలాగే ఈ ప్రోత్సహాకాలు మీరు అందుకోవాలంటే పాత ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ట్రక్కుకు సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ స్క్రాపేజ్ రుజువును సమర్పించాలి. అదేవిధంగా ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్‌ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధీకృత రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ జారీ చేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వెరిఫికేషన్ పీఎం ఈ డ్రైవ్ పోర్టల్, రిజిస్టర్డ్ డీలర్ ద్వారా నిర్వహిస్తారు. ఇక అన్నీ పూర్తయిన తర్వాత డీలర్ కొనుగోలు దారుడు ఐడీని జనరేట్ చేస్తాడు. ప్రోత్సహకాన్ని నేరుగా ఈ ట్రక్ అమ్మకానికి వర్తించేలా ఏర్పాటు చేస్తాడు.

Tags:    

Similar News