Car Driving Rules: కారు నడుపుతున్నారా.. ఈ బేసిక్‌ విషయాలు తెలియకుంటే చలాన్‌ కట్టాల్సిందే..!

Car Driving Rules: ఈ రోజుల్లో కారు కొనడం కొంతమంది కల. మరికొంతమందికి అవసరం.

Update: 2024-03-28 12:13 GMT

Car Driving Rules: కారు నడుపుతున్నారా.. ఈ బేసిక్‌ విషయాలు తెలియకుంటే చలాన్‌ కట్టాల్సిందే..!

Car Driving Rules: ఈ రోజుల్లో కారు కొనడం కొంతమంది కల. మరికొంతమందికి అవసరం. ఏది ఏమైనప్పటికీ కారు కలిగి ఉంటే మాత్రం కొన్ని బేసిక్‌ విషయాలు కచ్చితంగా తెలిసి ఉండాలి. లేదంటే ట్రాఫిక్‌ చలాన్ల పేరు మీద తరచుగా జేబుకు చిల్లు పడుతూ ఉంటుంది. కారును ఒకసారి రోడ్డుపైకి తీసుకురావాలంటే ట్రాఫిక్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని గుర్తుంచుకోండి. ఈ రోజు కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం.

అతి వేగం

మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంతో కారును నడపవద్దు. ఇలా చేస్తూ దొరికితే రూ.2000 వరకు చలాన్ జారీ చేస్తారు. వేర్వేరు రోడ్లు, ప్రదేశాల ప్రకారం వేగ పరిమితులు మారుతాయని గుర్తుంచుకోండి.

సీట్ బెల్ట్

కారులో ప్రయాణీకులందరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. సీటు బెల్ట్ ధరించకుంటే రూ.1,000 జరిమానా విధిస్తారు. వాస్తవానికి, భద్రతా కోణం నుంచి సీటు బెల్ట్ చాలా ముఖ్యం. ఇది ప్రమాద సమయంలో తీవ్రమైన గాయాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

తప్పు వైపు

మీరు కారును సరైన రూట్‌లో మాత్రమే నడపాలి. రాంగ్ సైడ్‌లో నడపడం వల్ల ట్రాఫిక్‌పై ప్రభావం పడుతుంది. ఇలా చేస్తూ పట్టుబడితే చలాన్ కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి.

డ్రంక్ అండ్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినమైన నిబంధనలు ఉంటాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.10,000 చలాన్‌ను జారీ చేస్తారు. ఇది కాకుండా జైలు శిక్ష ఉంటుంది. మద్యం తాగి వాహనం నడపవద్దు. ఇది మీ జీవితానికి ఇతరులకు చాలా ప్రమాదకరం.

సిగ్నల్ లైట్లు

సిగ్నల్ లైట్లను క్రమం తప్పకుండా పాటించాలి. దీనివల్ల ట్రాఫిక్‌ సజావుగా సాగి ప్రజలు సులువుగా ఎ పాయింట్‌ నుంచి బి పాయింట్‌కి వెళ్లగలుగుతారు. రెడ్ లైట్ వద్ద కచ్చితంగా కారు ఆపాలి. సిగ్నల్‌ జంప్ చేస్తే చలాన్ జారీ చేస్తారని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News