Car Care Tips: పెట్రోల్‌ కారులో డీజిల్‌ కొట్టించారా.. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా..?

Car Care Tips: వాహన కంపెనీలు పెట్రోల్‌కి తగ్గట్లుగా పెట్రోల్‌ ఇంజిన్‌, డీజిల్‌కు తగ్గట్లుగా డీజిల్‌ ఇంజిన్‌ తయారుచేస్తాయి.

Update: 2024-03-22 11:27 GMT

Car Care Tips: పెట్రోల్‌ కారులో డీజిల్‌ కొట్టించారా.. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా..?

Car Care Tips: వాహన కంపెనీలు పెట్రోల్‌కి తగ్గట్లుగా పెట్రోల్‌ ఇంజిన్‌, డీజిల్‌కు తగ్గట్లుగా డీజిల్‌ ఇంజిన్‌ తయారుచేస్తాయి. అయితే పెట్రోల్‌ ఇంజిన్‌ల్‌ డీజిల్‌ కొట్టించినా, డీజిల్‌ ఇంజిన్‌లో పెట్రోల్‌ కొట్టించినా ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. నిజానికి ఎవరూ కావాలని పెట్రోల్ కారులో డీజిల్ కొట్టించరు కూడా. కానీ ఎవరైనా ఈ పొరపాటు చేస్తే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోజు పెట్రోల్ కారులో డీజిల్ నింపడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

పెట్రోల్ కారులో డీజిల్ కొట్టిస్తే ఇంజిన్‌కు భారీ నష్టం జరుగుతుంది. ఎందుకంటే డీజిల్ సాంద్రత పెట్రోల్ కంటే ఎక్కువ. ఇది పెట్రోల్ కంటే తక్కువ మండుతుంది. డీజిల్ ఇంజిన్ అధిక పీడనం, టెంపరేచర్‌ వద్ద మండుతుంది. పెట్రోల్ ఇంజిన్ తక్కువ పీడనం, టెంపరేచర్‌ వద్ద మండుతుంది. ఈ కారణాల వల్ల ఇది ఇంజిన్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. డీజిల్ నింపి పెట్రోల్ కారును నడపడం వల్ల ఇంజిన్ సిలిండర్, పిస్టన్, షాఫ్ట్ దెబ్బతింటుంది. ఎక్కువ సేపు వాడటం వల్ల ఇంజన్ ఆగిపోతుంది. దీనివల్ల భారీ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంజిన్ చాలా ఖరీదైనది దానిని రిపేర్ చేయడం కూడా ఖరీదైనదే.

పెట్రోల్ ఇంజన్‌లో డీజిల్ బాగా మండదు. దీని కారణంగా కారు ఇది నెమ్మదిగా నడుస్తుంది. ఇంజిన్‌ భరీ శబ్దం చేస్తుంది. పొగ విపరీతంగా వస్తుంది. ఇది జరిగితే వెంటనే కారును అక్కడే ఆపాలి. మీరు అనుకోకుండా పెట్రోల్ కారులో డీజిల్ వేస్తే వీలైనంత త్వరగా గుర్తించడం అవసరం. మీకు ఈ విషయం తెలిసిన వెంటనే కారును స్టార్ట్ చేయవద్దు లేదా స్టార్ట్ అయితే వెంటనే ఆపాలి. తరువాత నిపుణుల సాయం తీసుకొని కారు ఇంజిన్‌ నుంచి తప్పు ఇంధనాన్ని బయటికి తీయాలి.లేదా కారును సర్వీస్ సెంటర్ కు తీసుకువెళ్లాలి. ఒకసారి డీజిల్ ఇంజిన్‌లోకి వస్తే దాన్ని తీయడం కష్టం.

Tags:    

Similar News