Cheapest Car In India: దేశంలో అత్యంత చౌకైన కారు ఇదే.. సేఫ్టీలో తిరుగులేదు బాసూ..!
Cheapest Car In India: దేశంలో అనేక కార్ల తయారీ కంపెనీలు ఉన్నాయి. వీటన్నింటిలో హ్యుందాయ్ ఎంతో ప్రత్యేకం.
Cheapest Car In India: దేశంలో అత్యంత చౌకైన కారు ఇదే.. సేఫ్టీలో తిరుగులేదు బాసూ..!
Cheapest Car In India
దేశంలో అనేక కార్ల తయారీ కంపెనీలు ఉన్నాయి. వీటన్నింటిలో హ్యుందాయ్ ఎంతో ప్రత్యేకం. అన్ని వర్గాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఈ కంపెనీ కార్లను విడుదల చేస్తుంటుంది.
హ్యుందాయ్ ధరతో సంబంధం లేకుండా అన్ని మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఇందులో దాని ఎంట్రీ-లెవల్ మోడల్ గ్రాండ్ ఐ10 నియోస్ కూడా ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ భారత్ మార్కెట్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్న అత్యంత చౌకైన కారు.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ బేస్ వేరియంట్ ఎరాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్‌ల వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.92 లక్షలు.
Hyundai Grand i10 Nios Features
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, క్రూయిజ్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఏసీ విత్ రియర్ వెంట్స్, పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. కారులో తగినంత లెగ్‌రూమ్, హెడ్‌రూమ్, లగేజీ ఉంచడానికి 260 లీటర్ల కార్గో స్పేస్ ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 83 పిఎస్ పవర్, 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుంగా ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఇదే ఇంజన్ సిఎన్‌జి పవర్ ట్రెయిన్‌తో కూడా రన్ అవుతుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సిఎన్‌జి మోడల్ ఇంజన్ 69పిఎస్ పవర్, 95ఎన్ఎమ్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలానే ఐ10 నియోస్ పెట్రోల్ మోడల్ మైలేజ్ లీటరుకు 16-18 కిమీ ఇస్తే.. సిఎన్‌జి మోడల్ కిలోకు 27 కిమీ మైలేజ్‌ని ఇస్తుంది.
Hyundai Grand i10 Nios Safety
ఈ హ్యాచ్‌బ్యాక్‌లో 30కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు దాని అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా, కారులో హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, చైల్డ్ సీట్ మౌంట్ వంటి ఫీచర్లు చూడొచ్చు.
Hyundai Grand i10 Nios Variants
ఈ హ్యుందాయ్ కారు ఎరా, మాగ్నా, కార్పొరేట్, స్పోర్ట్జ్, స్పోర్ట్జ్ (ఓ) , ఆస్టా అనే ఐదు ప్రధాన వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అయితే ఐ10 నియోస్ మిడ్-స్పెక్ మాగ్నా, స్పోర్ట్జ్ వేరియంట్‌లలో మాత్రమే సిఎన్‌జి ఆప్షన్ ఉంటుంది.
Hyundai Grand i10 Nios Price
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ బేస్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ. 5.92 లక్షలు, టాప్-ఎండ్ ఆస్టా ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 8.56 లక్షల వరకు ఉంది. మాగ్నా సిఎన్‌జి వేరియంట్ ధర 7.68 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.