Cheapest 7 Seater Cars: పెద్ద కార్లు.. బోలెడన్నీ ప్రయోజనాలు.. 26 కి.మీ మైలేజీ పక్కా.. ధర రూ. 5.32 లక్షల నుంచే స్టార్ట్..!
ఎక్కువ సీట్లు ఉన్న పెద్ద కార్ల పట్ల క్రేజ్ భారతదేశంలో విస్తృతంగా కనిపిస్తుంది.
Cheapest 7 Seater Cars: పెద్ద కార్లు.. బోలెడన్నీ ప్రయోజనాలు.. 26 కి.మీ మైలేజీ పక్కా.. ధర రూ. 5.32 లక్షల నుంచే స్టార్ట్..!
Cheapest 7 Seater Cars: ఎక్కువ సీట్లు ఉన్న పెద్ద కార్ల పట్ల క్రేజ్ భారతదేశంలో విస్తృతంగా కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, ప్రజలు తరచుగా దూర ప్రయాణాలు చేయడం వల్ల అలాంటి కార్లకు డిమాండ్ పెరిగింది. కుటుంబాలు కలిసి బయటకు వెళ్లి ప్రయాణాలు చేస్తుంటాయి, అందుకే తయారీదారులు తక్కువ బడ్జెట్‌లలో పెద్ద కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ కార్లు సేఫ్టీ పరంగా కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. కేవలం రూ. 5.70 లక్షల ప్రారంభ ధరతో లభించే కొన్ని సరసమైన, గొప్ప కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Maruti Eeco
మారుతి సుజుకి ఈకో ఒక బేసిక్ 5/6/7 సీటర్ కారు. ఇది చాలా బాగా అమ్ముడవుతోంది. ఇందులో తగినంత స్థలం అందుబాటులో ఉంది. ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, ఈ కారు 1.2 లీటర్ కె-సిరీస్ డ్యూయల్-జెట్ VVT పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ కారు పెట్రోల్ మోడ్‌లో లీటరుకు 19.71 కిలోమీటర్లు, సిఎన్‌జి మోడ్‌లో లీటరుకు 27 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది ఇల్యూమినేటెడ్ హజార్డ్ లైట్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ధర రూ.5.70 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Renault Triber
రెనాల్ట్ ట్రైబర్ ఒక నమ్మకమైన 7 సీట్ల ఫ్యామిలీ కారు. అందులో మంచి స్థలం ఉంది, కానీ బూట్ స్థలంలో సమస్య ఉండచ్చు. ఇందులో 1- లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. ఈ కారు లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 ఎయిర్‌బ్యాగ్స్, మూడవ వరుసలో ఏసీ వెంట్లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, మౌంటెడ్ స్టీరింగ్ వీల్, రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్ వ్యూ కెమెరా ఉన్నాయి. దీని ధర రూ.6.15 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Maruti Ertiga
మారుతి సుజుకి ఎర్టిగా కంప్లీట్ ఫ్యామిలీ కారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. కస్టమర్లకు సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే.. దీని పెట్రోల్ వేరియంట్ 20kmpl మైలేజీని ఇస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ 26.11 km/kg వరకు మైలేజీని ఇస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ప్యాడిల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్టిబ్యూషన్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.