Kawasaki: బంపర్ ఆఫర్.. కవాసాకీ బైక్ పై ఏకంగా రూ.లక్ష తగ్గింపు.. ప్రస్తుతం ధర ఎంతంటే ?
Kawasaki: ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి ఇండియా తమ కొన్ని మోటార్‌సైకిళ్లపై ఏకంగా రూ.లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ బంపర్ ఆఫర్ జూలై 31, 2025 వరకు మాత్రమే ఉంటుంది.
Kawasaki: బంపర్ ఆఫర్.. కవాసాకీ బైక్ పై ఏకంగా రూ.లక్ష తగ్గింపు.. ప్రస్తుతం ధర ఎంతంటే ?
Kawasaki: ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి ఇండియా తమ కొన్ని మోటార్‌సైకిళ్లపై ఏకంగా రూ.లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ బంపర్ ఆఫర్ జూలై 31, 2025 వరకు మాత్రమే ఉంటుంది. ఈ ప్రత్యేక తగ్గింపులు కవాసకి నింజా ZX-10R, వెర్సిస్ 1100, వెర్సిస్ 650, వెర్సిస్-ఎక్స్ 300 అనే నాలుగు పాపులర్ మోడళ్లపై వర్తిస్తాయి. ఈ డిస్కౌంట్‌లు కేవలం బైక్ ఎక్స్-షోరూమ్ ధరపైనే కాకుండా, బీమా, ఆర్‌టీఓ ఛార్జీలపై కూడా వర్తిస్తాయి. అంతేకాకుండా, బైక్‌ను సొంతం చేసుకోవడం మరింత సులభతరం చేయడానికి, కంపెనీ తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్‌లను కూడా అందిస్తోంది. అంటే, తక్కువ డబ్బు కట్టి బైక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.
కవాసకి నింజా ZX-10R
ఈ లీటర్-క్లాస్ సూపర్‌స్పోర్ట్ బైక్ అయిన కవాసకి నింజా ZX-10R పై రూ.లక్ష వరకు డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత దీని అసలు ధర రూ.18.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువగా ఉంటుంది. ఈ బైక్‌లో 998 సీసీ ఇన్-లైన్ ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 13,200 ఆర్‌పిఎమ్ వద్ద 200 బీహెచ్‌పీ పవర్, 11,400 ఆర్‌పిఎమ్ వద్ద 114.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉన్న 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్న టీఎఫ్‌టీ డిస్‌ప్లే, మల్టిపుల్ రైడ్ మోడ్స్, లాంచ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు చాలా ఉన్నాయి.
కవాసకి వెర్సిస్ 1100
ఈ పవర్‌ఫుల్ స్పోర్ట్స్ టూరర్ బైక్ కవాసకి వెర్సిస్ 1100 పై కూడా రూ.లక్ష వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.12.90 లక్షలు. ఈ బైక్‌ను ఇటీవల 2025లో కొద్దిగా పెద్దదైన 1,099 సీసీ ఇంజిన్‌తో అప్‌డేట్ చేశారు. ఇది 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 133 బీహెచ్‌పీ పవర్, 7,600 ఆర్‌పిఎమ్ వద్ద 112 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్మూత్ గేర్ షిఫ్ట్‌ల కోసం ఇందులో 6-స్పీడ్ రిటర్న్ ట్రాన్స్‌మిషన్, స్లిప్పర్, అసిస్ట్ క్లచ్ ఫీచర్లు ఉన్నాయి.
కవాసకి వెర్సిస్ 650
మిడ్‌సైజ్ అడ్వెంచర్ టూరర్ అయిన వెర్సిస్ 650 పై రూ.25,000 తగ్గింపు లభిస్తుంది. దీనితో దీని ధర రూ.7.77 లక్షల నుండి రూ.7.52 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గింది. ఈ బైక్‌లో 649 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంది, ఇది 65.7 బీహెచ్‌పీ పవర్, 61 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఎల్‌ఈడీ లైట్స్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో టీఎఫ్‌టీ స్క్రీన్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, యూఎస్‌బీ ఛార్జర్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కవాసకి వెర్సిస్-ఎక్స్ 300
చివరగా, కవాసకి వెర్సిస్-ఎక్స్ 300 పై రూ.15,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ డిస్కౌంట్‌తో పాటు అడ్వెంచర్ యాక్సెసరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ బైక్‌లో 296 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంది. ఇది 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 38.5 బీహెచ్‌పీ పవర్, 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 26.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్పర్ క్లచ్ ఉన్న 6-స్పీడ్ గేర్‌బాక్స్, తేలికపాటి అడ్వెంచర్ బేస్డ్ డిజైన్‌తో ఈ బైక్ వస్తుంది.