BMW 3 Series LWB: బీఎండబ్ల్యూ కొత్త కారు.. ఈ స్మార్ట్ ఫీచర్స్ అల్లాడించేశాయ్..!
BMW 3 Series LWB: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన 3 సిరీస్‌లలో లాంగ్ వీల్‌బస్ వేరియంట్ (LWB)ని దేశంలో విడుదల చేసింది. ఈ లగ్జరీ సెడాన్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.62.60 లక్షల ఎక్స్-షోరూమ్.
BMW 3 Series LWB: బీఎండబ్ల్యూ కొత్త కారు.. ఈ స్మార్ట్ ఫీచర్స్ అల్లాడించేశాయ్..!
BMW 3 Series LWB: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన 3 సిరీస్‌లలో లాంగ్ వీల్‌బస్ వేరియంట్ (LWB)ని దేశంలో విడుదల చేసింది. ఈ లగ్జరీ సెడాన్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.62.60 లక్షల ఎక్స్-షోరూమ్. ఈ కొత్త కారు చెన్నైలోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌లో తయారు చేశారు. ప్రస్తుతం ఈ కారు BMW 330Li M స్పోర్ట్ పెట్రోల్ వేరియంట్‌లో వస్తుంది. అయితే డీజిల్ వేరియంట్ తరువాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారు ఫీచర్స్, ఇంజన్ తదితర వివరాలు తెలుసుకుందాం.
BMW 3 Series LWB Engine
BMW 3 సిరీస్ LWBలో 2.0-లీటర్, 4-సిలిండర్ బీఎమ్‌డబ్ల్యూ ట్విన్‌పవర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 258హెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇచ్చారు. ఈ కారు కేవలం 6.2 సెకన్లలో 0 నుండి 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. ఈ కారులో ఈకో ప్రో మోడ్, కంఫర్ట్ మోడ్, స్పోర్ట్ మోడ్ వంటి డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి
BMW 3 Series Features And Specifications
భద్రత కోసం బీఎండబ్ల్యూ 3 సిరీస్ LWBలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో EBD, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త బీఎండబ్ల్యూ 3 సిరీస్ LWB కొలతల విషయానికి వస్తే.. కారు పొడవు 4,819 మిమీ, వీల్‌బేస్ 2,961 మిమీ, . ఈ కారు ఇప్పుడు మరింత స్మార్ట్, స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఇందులో ట్విన్-సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు అడాప్టివ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్‌లు ఉన్నాయి.
ఇంటీరియర్ గురించి చెప్పాలంటే బీఎండబ్ల్యూ 3 సిరీస్‌లో కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఇందులో ఒక M లెదర్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఉంది. ఈ డిజైన్ మరింత స్పోర్టీ లుక్‌ని ఇస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ కంఫర్ట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలానే పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ అందుబాటులో ఉన్నాయి.
బీఎండబ్ల్యూ 3 సిరీస్ LWBలో హైటెక్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా, BMW డిజిటల్ కీ ప్లస్ సిస్టమ్ అందుబాటులో ఉంది. మీ స్మార్ట్‌ఫోన్ మీ కారుకు కీలకం అవుతుంది. అలానే పార్క్ అసిస్టెంట్ ప్లస్, సరౌండ్ వ్యూ కెమెరాతో వస్తుంది, దీని ద్వారా మీరు మై బీఎమ్‌డబ్ల్యూ యాప్‌లో కారు 3D వ్యూ చూడచ్చు.