Bajaj Qute: బజాజ్ నుంచి బుజ్జి కార్.. సరికొత్త డిజైన్‌తో వచ్చేస్తోంది..!

Bajaj Qute: దేశంలో కేవలం రూ.3.61 లక్షలు మాత్రమే ఖరీదు చేసే కారు ఉందని మీకు తెలుసా?. ఈ కారు పేరు 'బజాజ్ క్యూట్'. ఇది క్వాడ్రిసైకిల్ కేటగిరీ కారు.

Update: 2025-02-15 15:00 GMT

Bajaj Qute: బజాజ్ నుంచి బుజ్జి కార్.. సరికొత్త డిజైన్‌తో వచ్చేస్తోంది..!

Bajaj reveals new dashboard design for Qute


Bajaj Qute: దేశంలో కేవలం రూ.3.61 లక్షలు మాత్రమే ఖరీదు చేసే కారు ఉందని మీకు తెలుసా?. ఈ కారు పేరు 'బజాజ్ క్యూట్'. ఇది క్వాడ్రిసైకిల్ కేటగిరీ కారు. దేశపు తొలి ఆటో ట్యాక్సీ కూడా ఇదే. కంపెనీ క్యూట్ డిజైన్‌కు సంబంధించి కొత్త ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. తాజాగా కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్ రివీల్ చేసింది. కంపెనీ దీనిని 13 డిసెంబర్ 2024న నమోదు చేసింది. ఈ కారు ధర మారుతి ఆల్టో కంటే తక్కువగా ఉంటుంది.

ఈ కారును 2019లో భారత మార్కెట్లోకి విడుదల చేశారు. కాగా, క్యూట్‌ను తొలిసారిగా 2012లో ప్రవేశపెట్టారు. మొదటి తరం క్యూట్ మరింత ప్రాక్టికల్ క్యాబిన్ కాన్ఫిగరేషన్‌తో మెరుగ్గా ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌ సెంటర్‌గా స్పీడోమీటర్, గేర్ లివర్ వంటివి మొదటి తరం క్యూట్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సెటప్ చూడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. 2024 సంవత్సరానికి సంబంధించిన డేటా ప్రకారం దేశంలోని మొత్తం 3-వీలర్ అమ్మకాలలో ఎలక్ట్రిక్ 3-వీలర్ల వాటా దాదాపు 56శాతం.

కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్ విషయానికి వస్తే మొదటి తరం క్యూట్‌లో కనిపించే సమస్యలను పరిష్కరించడానికి బజాజ్ కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్పీడోమీటర్ కన్సోల్ స్టీరింగ్ వీల్ వెనుకకు ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ నుండి గేర్ లివర్‌ను వేరు చేస్తారు. మరొక అప్‌డేట్ సెంట్రల్‌గా మౌంట్ చేసిన ఏసీ వెంట్. సెంట్రల్ కన్సోల్ విభాగంలో అనేక రోటరీ డయల్‌లను చూడచ్చు. రిఫ్రెష్ చేసిన బంపర్ డిజైన్, లైటింగ్ సెటప్ తదుపరి తరం క్యూట్‌లో కూడా చూడచ్చు. కస్టమర్లను ఆకర్షించడానికి మరింత ఆకర్షణీయమైన డిజైన్‌లో కూడా క్యూట్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

217సిసి, MPI పెట్రోల్ ఇంజన్ బజాజ్ క్యూట్‌లో ఉపయోగించారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. LPG, CNG రెండింటితో ఇంజన్ రన్ అవుతుంది. LPGపై నడుస్తున్నప్పుడు గరిష్ట పవర్ అవుట్‌పుట్ 12.44 పిఎస్. CNG మోడ్‌లో పవర్ అవుట్‌పుట్ 11 పిఎస్. తదుపరి తరం క్యూట్ 3-వీలర్‌కు సమానమైన మైలేజ్ ఇస్తుంది. క్యూట్ క్వాడ్రిసైకిల్.. కాబట్టి గరిష్ట వేగం గంటకు 70 కిమీకి పరిమితం అయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News