Bajaj Chetak 3503 Launched: అతి తక్కువ ధరకే.. బజాజ్ చేతక్ 3503 ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..!
Bajaj Chetak 3503 Launched: బజాజ్ తన అత్యంత సరసమైన చేతక్ 35 సిరీస్‌లో కొత్త మోడల్ చేతక్ 3503ని భారత మార్కెట్లో విడుదల చేసింది. చేతక్ 3501, 3502 వంటి మోడళ్ల సక్సెసర్‌గా 3503 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 1.10 లక్షలుగా నిర్ణయించారు. ఇది ప్రస్తుత చేతక్ 3501 వేరియంట్ కంటే దాదాపు రూ. 20,000 తక్కువ. కంపెనీ లక్ష్యం చేతక్ బ్రాండ్‌ను మరింత మంది భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం. ఈ క్రమంలో ఈ స్కూటర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, రేంజ్ తదితర వివరాలు తెలుసుకుందాం.
Bajaj Chetak 3503 Launched: అతి తక్కువ ధరకే.. బజాజ్ చేతక్ 3503 ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు..!
Bajaj Chetak 3503 Price
బజాజ్ ఎలక్ట్రిక్ లైనప్‌లో ఇది అత్యంత చౌకైన స్కూటర్, దీని ధర కేవలం రూ. 1.10 లక్షల ఎక్స్-షోరూమ్. ఇది మునుపటి మోడల్ చేతక్ 3501 కంటే దాదాపు రూ.20,000 తక్కువ. స్టైలిష్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కోరుకునే వారికి ఇది తిరుగులేని ఆప్షన్.
Bajaj Chetak 3503 Battery
ఈ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.5కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 55 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 63 కి.మీ. వినియోగదారులు దీనిని బ్రూక్లిన్ బ్లాక్, ఇండిగో బ్లూ, సైబర్ వైట్, మ్యాట్ గ్రే వంటి కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
Bajaj Chetak 3503 Features
బజాజ్ చేతక్ 3503 ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్ కనెక్షన్‌తో కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. దీనితో పాటు, అధునాతన ఫీచర్లను అప్‌గ్రేడ్ చేసుకునే సౌకర్యం కూడా టెక్-ప్యాక్‌తో అందుబాటులో ఉంది. దీనికి డ్రమ్ ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ మాత్రమే ఉన్నాయి.
ఈ మోడల్‌ను మరింత తక్కువ ధరకు అందించడానికి బజాజ్ కొన్ని ఫీచర్లను తగ్గించింది. ఇతర మోడళ్ల మాదిరిగా, దీనికి పూర్తి డిజిటల్ డిస్‌ప్లే, స్టైలిష్ టర్న్ ఇండికేటర్లు లేవు. ఇతర చేతక్ మోడళ్లలో కనిపించే అదే 3.5కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఈ స్కూటర్‌లో ఉంది.
Bajaj Chetak 3503 Bookings
బజాజ్ చేతక్ 3503 బుకింగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది. దీని డెలివరీ మే 2025 మొదటి వారం నుండి ప్రారంభమవుతుంది. మీరు సరసమైన ధరకు నమ్మకమైన, స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే, మీరు చేతక్ 3503 ను కళ్లు మూసుకొని కొనుగోలు చేయచ్చు. ఇది దేశీయ మార్కెట్లో ఓలా S1 ప్రో , ఏథర్ 450X వంటి స్కూటర్లతో పోటీపడుతుంది.