Automobile Sales: జూన్ నెలలో భారీగా తగ్గిన ఆటోమొబైల్స్..కారణం అదేనా?
Automobile Sales: దేశంలో గత నెలలో ఆటోమొబైల్స్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ముఖ్యంగా చిన్నకార్లలో భారీ పతనం కనిపించింది. దేశంలో ఉన్న టాప్ ఆటోమొబైల్ కంపెనీలు మారుతి, హ్యుందాయ్ మోటార్ ఇండియాలో కార్ల అమ్మకాలు రెండంకెలు తగ్గింది.

కొన్నాళ్ల నుంచి ఆటోమొబైల్ రంగం శరవేగంతో దూసుకుపోతుంది. అయితే ఇటీవల కాలంలో కాస్త నెమ్మదైంది. జూన్‌లో నెలలో అయితే భారీగా ఆటో మొబైల్ అమ్మకాలు తగ్గాయి. దేశంలో ఉన్న టాప్ కంపెనీలు కూడా లాస్‌లను చవిచూసాయి. మారుతి సుజికి గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ సారి భారీగా తగ్గిపోయింది. అంటే 13 శాతం తగ్గి 1,18,906 యూనిట్లకు చేరుకుంది. ఇక హ్యూందాయ్ పరిస్తితి కూడా ఇంతే. దేశీయ మార్కెట్లో 12 శాతం సరఫరా తగ్గిపోయింది. అంటే 44, 024 యూనియట్లకు ఈ కంపెనీ చేరుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా టాటా మోటార్స్ పీవీ, ఈవీల అమ్మకాలు 15 శాతం తగ్గి 37,083 యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతోపాటు బజాజ్ ఆటో దేశీయ విక్రయాలు కూడా 13 శాతం తగ్గాయి.
అయితే రాయిల్ ఎన్ ఫీల్డ్ దేశీయ అమ్మకాలు 16 శాతం పెరిగితే, టీవీఎస్ మోటార్ కంపెనీ టూవీలర్ల అమ్మకాలు పది శాతం పెరిగాయి. అలాగే మంహేద్ర అండ్ మహేంద్ర సేల్స్ 18 శాతవ పెరిగితే.. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 5 శాతం పెరిగి 28,869 యూనిట్లకు చేరుకున్నాయి.