Airless Tyre: గాలి నింపే అవసరం లేదు.. పంక్చర్ భయమే ఉందడు.. మార్కెట్‌లో వచ్చిన ఎయిర్‌లెస్ టైర్.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Airless Tyre Technology: కారు, బైక్, బస్సు లేదా ఇతర వాహనాలు.. వీటన్నింటిలోని టైర్లను మీరు తప్పక చూసి ఉంటారు. ఇవన్నీ గాలితో నిండి ఉంటాయి.

Update: 2023-09-19 12:45 GMT

Airless Tyre: గాలి నింపే అవసరం లేదు.. పంక్చర్ భయమే ఉందడు.. మార్కెట్‌లో వచ్చిన ఎయిర్‌లెస్ టైర్.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Airless Tyre Technology: కారు, బైక్, బస్సు లేదా ఇతర వాహనాలు.. వీటన్నింటిలోని టైర్లను మీరు తప్పక చూసి ఉంటారు. ఇవన్నీ గాలితో నిండి ఉంటాయి. ఈ టైర్లు పంక్చర్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ, Ohio ఆధారిత కంపెనీ SMART (షేప్ మెమరీ అల్లాయ్ రేడియల్ టెక్నాలజీ) ప్రత్యేక ఎయిర్‌లెస్ టైర్‌లను సృష్టించింది. దీని ప్రేరణ NASA రోవర్ టైర్ టెక్నాలజీ నుంచి తీసుకోబడింది. అయితే, ఎయిర్‌లెస్ టైర్ కాన్సెప్ట్‌ని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు, బ్రిడ్జ్‌స్టోన్, మిచెలిన్ మొదలైన కంపెనీలు కూడా ఇటువంటి కాన్సెప్ట్‌లను ప్రవేశపెట్టాయి.

గాలిలేని టైర్..

కానీ, తేడా ఏమిటంటే SMART ఎయిర్‌లెస్ టైర్లు అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. 'నాసా చంద్రుడిపైకి పంపిన రోవర్లలో ఉపయోగించే అదే సాంకేతికతతో మేము టైర్లను అభివృద్ధి చేశాం' అని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఈ టైర్లను సైకిళ్లకు మాత్రమే తయారు చేశారు. కానీ, భవిష్యత్తులో కార్లు, బైక్‌లకు కూడా ఎయిర్‌లెస్ టైర్లను కంపెనీ తయారు చేయవచ్చు.

అద్భుత టెక్నాలజీ..

కాయిల్-స్ప్రింగ్ అంతర్గత నిర్మాణం కారణంగా ఈ టైర్‌లో గాలి నింపాల్సిన అవసరం లేదు లేదా పంక్చర్ అయ్యే ప్రమాదం కూడా ఉండదు. ఈ టైర్ రబ్బరుతో కాదు లోహంతో తయారు చేశారు. ఇది స్లింకీ లాంటి స్ప్రింగ్‌ని కలిగి ఉంది. ఇది టైర్ చుట్టూ ఉంటుంది. ఈ స్ప్రింగ్ నికెల్-టైటానియం మెటల్‌తో తయారు చేశారు. ఈ లోహాన్ని నిటినోల్ అని కూడా అంటారు.

ప్రత్యేకతలు..

టైటానియం లాగా దృఢంగానూ, రబ్బరులా ఫ్లెక్సిబుల్ గానూ ఉండడం దీని ప్రత్యేకత. నిటినోల్‌పై ఒత్తిడి పెరిగినప్పుడు, మొదట్లో దాని ఆకారం మారిపోతుంది. అయితే తర్వాత అది పాత ఆకృతికి వస్తుంది. ఇది మెటల్ టైర్‌కు నెమ్మదిగా కంప్రెస్, రీబౌండ్ చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది సాధారణ రబ్బరు టైర్ లాగానే ఉంటుంది.

Tags:    

Similar News