2026 Honda PCX 160: 2026 హోండా PCX 160.. సరికొత్త రంగులు.. ప్రీమియం ఫీచర్లు..!

2026 Honda PCX 160: హోండా టూ-వీలర్స్ తన బెస్ట్ సెల్లింగ్ మ్యాక్సీ స్కూటర్ హోండా PCX 160 2026 మోడల్‌ను విడుదల చేసింది.

Update: 2025-10-08 12:00 GMT

2026 Honda PCX 160: 2026 హోండా PCX 160.. సరికొత్త రంగులు.. ప్రీమియం ఫీచర్లు..!

2026 Honda PCX 160: హోండా టూ-వీలర్స్ తన బెస్ట్ సెల్లింగ్ మ్యాక్సీ స్కూటర్ హోండా PCX 160 2026 మోడల్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ 2012లో ప్రారంభించారు. అప్పటి నుండి ఇది దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతోంది. ఇప్పుడు కంపెనీ తన 2026 మోడల్‌ను కొన్ని కొత్త రంగు ఎంపికలతో అప్‌డేట్ చేసింది. కంపెనీ ఈ స్కూటర్‌ను బ్రెజిల్‌లో విడుదల చేసింది. అదే సమయంలో ఈ స్కూటర్ బ్రెజిల్‌లో దాదాపు 33శాతం మార్కెట్ వాటాతో బలమైన పట్టును పొందింది. 2026 హోండా PCX 160లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయో తెలుసుకుందాం.

2026 హోండా PCX 160 మూడు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. అవి PCX CBS, PCX ABS,PCX DLX ABS. ఈ మూడింటినీ కొత్త రంగులలో తీసుకువచ్చారు. PCX CBS వేరియంట్ పెర్ల్ వైట్‌లో, PCX ABS వేరియంట్ పెర్ల్ స్పెన్సర్ బ్లూలో, PCX DLX ABS వేరియంట్ మెటాలిక్ బ్లాక్ కలర్‌లో తీసుకువచ్చారు. ఈ మూడింటి ధర గురించి మాట్లాడుకుంటే, PCX CBS వేరియంట్ ధర R$ 18,340 (సుమారు రూ. 2.98 లక్షలు), PCX ABS వేరియంట్ ధర R$ 20,170 (సుమారు రూ. 3.28 లక్షలు), PCX DLX ABS వేరియంట్ ధర R$ 20,640 (సుమారు రూ. 3.35 లక్షలు).

2026 హోండా PCX 160 మోడల్‌లోని ఇంజిన్ సెటప్ మునుపటిలాగే ఉంచారు. ఇందులో 156.9cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ ఉంది, ఇది 16 హెచ్‌పి పవర్, 14.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది V-మ్యాటిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది.

కొత్త PCX 160కి కూడా అనేక గొప్ప ఫీచర్లు అందించారు. LED లైటింగ్, పెద్ద విండ్‌స్క్రీన్, స్టెప్-అప్ సీటు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, సీట్ ఎత్తు 764మి.మీ, గ్రౌండ్ క్లియరెన్స్ 134మి.మీ, CBS వేరియంట్ బరువు 124kg, ABS వేరియంట్ బరువు 126kg. దీనిలో డిజిటల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కూడా ఉంది, ఇది స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, బ్యాటరీ ఇండికేటర్, V-బెల్ట్ అలర్ట్, ఫ్యూయల్ గేజ్ గురించి సమాచారాన్ని అందిస్తుంది. దీనితో పాటు, 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించారు.

PCX 160కి అండర్‌బోన్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డ్యూయల్ రియర్ షాక్‌లు ఉన్నాయి. రెండు చివర్లలో 100మి.మీ సస్పెన్షన్ ట్రావెల్ ఇచ్చారు. దీనికి 14-అంగుళాల (110/70 టైర్లు) ముందు చక్రాలు, 13-అంగుళాల (130/70 టైర్లు) వెనుక చక్రాలు ఉన్నాయి. అదే సమయంలో ముందు, వెనుక భాగంలో 220mm డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. సింగిల్ ఛానల్ ABS కూడా అందుబాటులో ఉంది. దాని CBS వేరియంట్‌లో వెనుక డ్రమ్ బ్రేక్‌లు అందించారు.

హోండా భారతదేశంలో PCX 160 ను ట్రేడ్‌మార్క్ చేసింది. దీని విడుదలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ, అప్రిలియా SXR 160, యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 వంటి ఎంపికలు ఇప్పటికే ఈ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. రాబోయే కాలంలో TVS Ntorq 150 కూడా ప్రారంభించారు. అటువంటి పరిస్థితిలో, హోండా PCX 160 భారత మార్కెట్‌లోకి రావడం పూర్తిగా సాధ్యమే అనిపిస్తుంది.

Tags:    

Similar News