2025 Altroz ​​Facelift: మరోసారి మార్కెట్‌ను దున్నేయడం ఖాయం.. త్వరలో రోడ్లపైకి 2025 టాటా ఆల్ట్రోజ్.. మే 21న రెడీగా ఉండండి..!

2025 Altroz ​​Facelift: టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్‌ను విడుదల చేసింది.

Update: 2025-05-03 09:46 GMT

2025 Altroz ​​Facelift: మరోసారి మార్కెట్‌ను దున్నేయడం ఖాయం.. త్వరలో రోడ్లపైకి 2025 టాటా ఆల్ట్రోజ్.. మే 21న రెడీగా ఉండండి..!

2025 Altroz ​​Facelift: టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్‌ను విడుదల చేసింది. టాటా మోటార్స్ విడుదల చేసిన టీజర్‌లో కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ కనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత కొత్త ఆల్ట్రోజ్ మునుపటి కంటే మెరుగైన డిజైన్, స్టైలిష్ లుక్‌తో రాబోతోందని స్పష్టమైంది. 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ టీజర్‌ ద్వారా ఎటువంటి ఫీచర్లు వెల్లడయ్యాయి. ధర ఎంత, తదితర వివరాలు తెలుసుకుందాం.

2025 Altroz ​​Facelift Design

2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కొత్త షార్ప్ ఫ్రంట్ ఫాసియాను పొందుతుంది. ఇది సిల్వర్ ఇన్సర్ట్‌లు, ట్విన్-పాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్ఎల్‌లతో కొత్త గ్రిల్‌ ఉంటుంది. దీనితో పాటు పెద్ద ఎయిర్ డ్యామ్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్‌లతో కూడిన స్పోర్టి బంపర్‌ ఉండే అవకాశం ఉంది, ఇది కారుకు అడ్వెంచర్‌ లుక్‌ను ఇస్తుంది. అలానే ఎలక్ట్రానిక్ పాప్-అవుట్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ ఉంటాయి. వీటిని మీరు టాటా కర్వ్‌లో చూసి ఉండవచ్చు.

2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఇవి మునుపటి కంటే ఎక్కువ ప్రీమియం లుక్‌ని ఇస్తాయి. దీని వెనుక లుక్ గురించి చెప్పాలంటే కనెక్ట్ చేసిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి, ఇవి ఇతర ఆధునిక కార్ల మాదిరిగానే కనిపిస్తాయి. రివర్స్ లైట్ ఇప్పుడు నంబర్ ప్లేట్ హౌసింగ్ క్రింద ఉన్న బంపర్‌లో అందించారు.

2025 Altroz ​​Facelift Interior

2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ని ఇంటీరియర్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ టీజర్ ద్వారా వెనుక విండ్‌షీల్డ్ కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఈ కారును ఇప్పుడు కొత్త లైట్ బ్రౌన్ అప్హోల్స్టరీ , డాష్‌బోర్డ్‌లో కొన్ని చిన్న మార్పులతో చూడవచ్చు. టాటా కొత్త రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కూడా అందించవచ్చు.

2025 Altroz ​​Facelift Features

2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు కొత్త టాటా వాహనాల్లో కనిపించే విధంగా టచ్-బేస్డ్ ఏసీ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. అలానే 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, 8-స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్‌తో అందించారు. ఇప్పుడు ముందు వెంటిలేటెడ్ సీట్లను ఇచ్చే అవకాశం ఉంది.

2025 Altroz ​​Facelift Safety Features

సేఫ్టీ విషయానికి వస్తే ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి.

2025 Altroz ​​Facelift Price And Launch Date

2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో రూ. 7-8 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేయచ్చు. కొత్త టాటా ఆల్ట్రోజ్‌ను మే 21న భారతదేశంలోకి రావచ్చు. ఇది మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఐ20 లతో నేరుగా పోటీపడుతుంది.

Tags:    

Similar News