2025 Royal Enfield Hunter 350 Launched: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి సూపర్ బైక్ .. మూడు కలర్స్ లో అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే..?
2025 Royal Enfield Hunter 350 Launched: రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో తన అత్యంత సరసమైన మోటార్ సైకిల్ హంటర్ 350 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది.
2025 Royal Enfield Hunter 350 Launched: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి సూపర్ బైక్ .. మూడు కలర్స్ లో అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే..?
2025 Royal Enfield Hunter 350 Launched: రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో తన అత్యంత సరసమైన మోటార్ సైకిల్ హంటర్ 350 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. హంటర్‌లో ఇంత పెద్ద మార్పులు చేయడం ఇదే మొదటిసారి. ఈ బైక్‌లో కొత్త ఫీచర్లు అందించారు. యువతను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను రూపొందించారు. మీరు ఈ బైక్ కొనాలని ఆలోచిస్తుంటే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
2025 Royal Enfield Hunter 350 Updates
2025 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 లో అతిపెద్ద మార్పు వెనుక సస్పెన్షన్. ఇది ఇప్పుడు లీనియర్ స్ప్రింగ్ నుండి ప్రోగ్రెసివ్ స్ప్రింగ్‌గా మారింది. ఎగ్జాస్ట్ కోసం కొత్త రూటింగ్‌తో పాటు, గ్రౌండ్ క్లియరెన్స్ 10 మిమీ పెరిగింది. మునుపటి మోడల్‌లో సస్పెన్షన్ గట్టిగా ఉండేది కానీ, కానీ ఇప్పుడు అది మునుపటి కంటే మృదువుగా ఉంది.
2025 Royal Enfield Hunter 350 Specifications
ఈ బైక్ లో కొత్తగా రూపొందించిన సీటును అందించారు. దీని ప్రొఫైల్ ముందులానే ఉంది. కంపెనీ తన అన్ని వేరియంట్లకు స్లిప్-అసిస్ట్ క్లచ్ ఫీచర్‌ను అందించింది. ఇది కాకుండా ఇంకా చాలా మంచి ఫీచర్లు అప్డేట్ చేశారు. కొత్త హంటర్ 350 ఇప్పుడు LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ పాడ్‌తో కూడిన డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టాప్ వేరియంట్‌లో టైప్-సి ఛార్జర్‌తో వస్తుంది. ఈ బైక్ 6 రంగులలో లభిస్తుంది.
2025 Royal Enfield Hunter 350 Engine
కొత్త హంటర్ 350 ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. మునుపటిలాగే, ఈ బైక్‌లో 349సీసీ
ఎయిర్-కూల్డ్ జె-సిరీస్ ఇంజిన్ అమర్చారు, ఇది 20.2 హెచ్ పి పవర్, 27ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ ఇప్పుడు స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌కతో ఉంటుంది.
2025 Royal Enfield Hunter 350 Price
కొత్త హంటర్ 350 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.50 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని మిడ్-స్పెక్ వేరియంట్ ధర రూ. 1.77 లక్షలు, ఎక్స్-షోరూమ్, టాప్ వేరియంట్ ధర రూ. 1.82 లక్షలు, ఎక్స్-షోరూమ్. పాత మోడల్‌తో పోలిస్తే దాని టాప్ వేరియంట్ ధరను రూ.5,000 పెంచారు. హంటర్ 350, హోండా CB350 RS, జావా 42 వంటి బైక్ లతో పోటీపడుతుంది.