KTM 390 Adventure S: యూత్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది.. కేటీఎమ్ నుంచి కొత్త అడ్వెంచర్ బైక్ వచ్చేస్తోంది..!
KTM 390 Adventure S: భారతీయ మార్కెట్లో స్పోర్ట్స్ బైకులను విక్రయించే కేటీఎమ్ తన ప్రసిద్ధ అడ్వెంచర్ బైక్ 390 S టీజర్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌లోని ఫీచర్లు, పనితీరు వేరియంట్లు, ధర తదితర వివరాను తెలుసుకుందాం.
KTM 390 Adventure S: యూత్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది.. కేటీఎమ్ నుంచి కొత్త అడ్వెంచర్ బైక్ వచ్చేస్తోంది..!
KTM 390 Adventure S: భారతీయ మార్కెట్లో స్పోర్ట్స్ బైకులను విక్రయించే కేటీఎమ్ తన ప్రసిద్ధ అడ్వెంచర్ బైక్ 390 S టీజర్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌లోని ఫీచర్లు, పనితీరు వేరియంట్లు, ధర తదితర వివరాను తెలుసుకుందాం.
KTM 390 Adventure S Engine
కేటీఎమ్ 390 అడ్వెంచర్‌లో S 373సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 43.5 బిహెచ్‌పి పవర్, 37ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. దీనిలో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన స్లిప్పర్ క్లచ్ గేర్‌బాక్స్ ఉంది. అడ్వెంచర్స్ కోసం ట్యూన్ చేసిన ఈ ఇంజన్ దూర ప్రయాణాలు,ఆఫ్-రోడింగ్ రెండింటిలోనూ అద్భుతంగా పనిచేస్తుంది.
KTM 390 Adventure S Features
ఈ బైక్ కొత్త ఫ్రంట్ ఫేస్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. ఈ బైక్‌లో ఏరోడైనమిక్ బాడీని ఉపయోగించారు. ఇందులో మెరుగైన పనితీరు కోసం తేలికపాటి, బలమైన ఛాసిస్ వినియోగించారు. దీని గ్రాఫిక్స్, కలర్ స్కీమ్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
మెరుగైన గ్రిప్ కోసం ఈ బైక్‌లో హై-ట్రాక్షన్ డ్యూయల్-పర్పస్ టైర్లు ఉన్నాయి. బైక్‌కు రెండు వైపులా WP APEX సస్పెన్షన్ ఉంది. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 220 మిమీ కంటే ఎక్కువగా ఉంది. ఆఫ్-రోడ్ ట్రయల్‌కి చాలా బెటర్‌గా పని చేస్తుంది. అలానే బైక్‌కు టిఎఫ్‌టి డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, కస్టమైజేషన్ ఫీచర్‌లు ఉన్నాయి.
ఈ బైక్‌లో స్ట్రీట్, ఆఫ్-రోడ్, రెయిన్ మోడ్‌లు వంటి మూడు రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉండే క్విక్‌షిఫ్టర్ గేర్ షిఫ్టింగ్‌ను మరింత సున్నితంగా చేస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఆఫ్-రోడ్ మోడ్ ఫీచర్లు ఇందులో అందించారు. ఈ బైక్‌లో బైబ్రేక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి.
KTM 390 Adventure S Price
ఈ బైక్ ధర రూ. 3.5 లక్షల నుండి రూ. 3.8 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది. అయితే దీనిని 2025 మధ్యలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.