2025 Hero Splendor Plus Launched: దేశంలో అందరి ఫేవరేట్ బైక్.. కొత్తగా హీరో ప్యాషన్ ప్లస్.. ఇప్పుడు రేటెంతో తెలుసా..?

2025 Hero Splendor Plus Launched: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన ప్రసిద్ధ ఎంట్రీ లెవల్ బైక్ ప్యాషన్ ప్లస్ 2025 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Update: 2025-04-11 10:13 GMT

2025 Hero Splendor Plus Launched: దేశంలో అందరి ఫేవరేట్ బైక్.. కొత్తగా హీరో ప్యాషన్ ప్లస్.. ఇప్పుడు రేటెంతో తెలుసా..?

2025 Hero Splendor Plus Launched: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన ప్రసిద్ధ ఎంట్రీ లెవల్ బైక్ ప్యాషన్ ప్లస్ 2025 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు ఈ బైక్ ఇంజిన్ OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ అయింది. దీనివల్ల బైక్ మెరుగైన మైలేజ్, మంచి పనితీరు, కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అప్‌డేట్ చేసిన ప్యాషన్ ప్లస్ మునుపటి మాదిరిగానే అదే సింగిల్ (i3S డ్రమ్ సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్) వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ 4 కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అయింది. అందులో బ్లాక్ హెవీ గ్రే, బ్లాక్ నెక్సస్ బ్లూతో పాటు బ్లాక్ గ్రే స్ట్రైప్, బ్లూయిష్ టీల్, స్పోర్ట్ రెడ్ స్థానంలో స్పోర్ట్స్ రెడ్ బ్లాక్ ఉన్నాయి.

2025 Hero Passion Plus Features

కొత్త ప్యాషన్ ప్లస్ కొలతల విషయానికి వస్తే పొడవు 1,982మిమీ, వెడల్పు 770మిమీ, ఎత్తు 1,087మిమీ, వీల్‌బేస్ 1235మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 168మిమీ. ఈ బైక్‌ను డబుల్ క్రెడిల్ ఫ్రేమ్‌పై బిల్డ్ చేశారు. ఇందులో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS), ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, యుటిలిటీ బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎంట్రీ లెవల్ కమ్యూటర్ సెగ్మెంట్ బైక్ కావడంతో ఇందులో ముఖ్యమైన అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ బరువు 115 కిలోలు,ఇంధన ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లు. ఇది కాకుండా, సీటు ఎత్తు 790మిమీ. ఇది రోజువారీ వినియోగానికి మంచి బైక్. ఈ బైక్ డిజైన్ కొంచెం స్పోర్టీగా ఉంది.

2025 Hero Passion Plus Engine

2025 ప్యాషన్ ప్లస్ 97.2సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ అప్‌డేట్ OBD-2B ఉద్గారాలు, ఫ్యూయల్-ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఇంజిన్ 7.91బిహెచ్‌పి పవర్, 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ సులభతరం చేయడానికి ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్,వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్‌కి జతై ఉంటుంది. ఈ బైక్‌లో 18 అంగుళాల టైర్లు, డ్రమ్ బ్రేక్‌ ఉన్నాయి. ధర గురించి మాట్లాడుకుంటే.. కొత్త ప్యాషన్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 82,016.

Tags:    

Similar News